Oye Re-Release: రీ రిలీజ్ కాబోతున్న ఓయ్.. ఎప్పుడంటే?

  • February 2, 2024 / 12:44 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. పోకిరి సినిమా రీ రిలీజ్ అయ్యి అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టడంతో మిగిలిన హీరోలు కూడా ఇదే బాటలో పయనిస్తూ తమ కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమాలను తిరిగి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో సూపర్ హిట్ మూవీ కూడా తిరిగి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

నటుడు సిద్ధార్థ్ హీరోగా బేబీ షామిలి హీరోయిన్ గా నటించినటువంటి చిత్రం ఓయ్ ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత నటి బేబీ షామిలి పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు. ఈ సినిమా విడుదలయ్యి అప్పట్లో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా (Oye) విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతుందని తెలుస్తుంది. వాలెంటైన్స్ డేని పురస్కరించుకొని ఫిబ్రవరి 14వ తేదీ ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే రీ రిలీజ్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఇక ఇదే విషయాన్ని ఈ సినిమా డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. సినిమాతోనే డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు దర్శకుడు ఆనంద్ రంగా. అయితే ఆ తరువాత మళ్ళీ మరో సినిమా చేయలేదు. శ్రీకాంత్ అండ్ ప్రకాష్ రాజ్ తో 2020లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించారు. అలాగే రెండు సినిమాలకు నిర్మాతగా కూడా ఈయన వ్యవహరించారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus