Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • September 11, 2026 / 12:18 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Cast & Crew

  • ప్రేమిస్తే భ‌ర‌త్‌ (Hero)
  • మేధా రెడ్డి (Heroine)
  • శివాజీరాజా, సూర్య శ్రీనివాస్‌, రూప‌ల‌క్ష్మి త‌దిత‌రులు (Cast)
  • మోహన్ శ్రీవత్స (Director)
  • విజయేంద్ర మౌళి, ఉదయ భాను (Producer)
  • నరేష్ కుమారన్ (Music)
  • సందీప్ కాంత్.ఎన్ (Cinematography)
  • శ్రీనివాస్ బైనబోయిన (Editor)
  • Release Date : 11 సెప్టెంబ‌ర్‌ 2026
  • ఉదయ భాను ప్రొడక్షన్స్ (Banner)

“ప్రేమిస్తే” ఫేమ్ భ‌ర‌త్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు వెబ్‌సిరీస్ పంచ‌నామా శుక్ర‌వారం జీ5 ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ వెబ్‌సిరీస్‌కు మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మేధా రెడ్డి, శివాజీ రాజా, సూర్య శ్రీనివాస్, రూప‌ల‌క్ష్మి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. విజ‌యేంద్ర మౌళితో క‌లిసి యాంక‌ర్ ఉద‌య‌భాను పంచ‌నామా వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. ఈ తెలుగు వెబ్‌సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? అంటే?

Panchanama Review

క‌థ‌: జ‌య‌రాం అలియాస్ జై (భ‌ర‌త్‌) సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌. అమ్మ‌నాన్న‌లు లేని జై క‌ష్ట‌ప‌డి పోలీస్ అవుతాడు. అనాథ అయిన ఆదిని (చ‌ర‌ణ్ బాబు) త‌న త‌మ్ముడిలానే భావిస్తుంటాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న‌ ఆది అనుమానాస్ప‌ద రీతిలో హాస్ట‌ల్‌లో చ‌నిపోతాడు. అది హ‌త్య కాద‌ని నాచుర‌ల్ డెత్‌గా పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలుతుంది. ఆది చ‌నిపోయిన రోజే మ‌రో ముగ్గురు అనాథ‌లు కూడా వేర్వేరు ప్ర‌మాదాల్లో క‌న్నుమూస్తారు. ఈ నాలుగు మ‌ర‌ణాల వెనుక ఏదో మిస్ట‌రీ ఉంద‌ని జై అనుమాన‌ప‌డ‌తాడు. అత‌డి ఇన్వేస్టిగేష‌న్‌లో న‌లుగురు హ‌త్య‌కు గుర‌య్యార‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. వారిని చంపింది మ‌నోజ్ అని తెలుసుకుంటాడు. అత‌డిని ప‌ట్టుకొనే లోపే పారిపోతాడు. ఆ త‌ర్వాత మ‌నోజ్ డెడ్‌బాడీ పోలీసుల‌కు దొరుకుతుంది . అస‌లు ఈ హ‌త్య‌లు ఎవ‌రు చేస్తున్నారు? జ‌య‌రాం సోద‌రి దేవ‌కి ఎలా చ‌నిపోయింది? జైని సొంత కొడుకులా చూసుకుంటాన‌ని మాటిచ్చిన దేవ‌కి భ‌ర్త హ‌రి (సూర్య శ్రీనివాస్‌) ఏమ‌య్యాడు? ఈ వ‌రుస మ‌ర్డ‌ర్స్‌కు డాక్ట‌ర్ పుష్ప‌వ‌ల్లికి (రూప‌ల‌క్ష్మి)ఉన్న సంబంధం ఏమిటి? కొడుకే లోకంగా బ‌తికే ముర‌ళికి (శివాజీరాజా) ఎలాంటి అన్యాయం జ‌రిగింది? జైని ప్రేమించిన ధ‌ర‌ణి అత‌డిని కాకుండా మ‌రొక‌రితో పెళ్లికి ఎందుకు సిద్ధ‌ప‌డింది? అన్న‌దే పంచ‌నామా వెబ్‌సిరీస్ మిగిలిన క‌థ‌..

న‌టీన‌టుల ప‌నితీరు: ఈ వెబ్‌సిరీస్ క‌థ మొత్తం భ‌ర‌త్ చుట్టూనే తిరుగుతుంది. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా హుందాగా న‌టించాడు. ఓ వైపు క‌ఠినంగా క‌నిపిస్తూనే మ‌రోవైపు ఎమోష‌న్స్‌ను పండించిన తీరు బాగుంది. జ‌య‌రాంను ప్రేమించే పోలీస్ ఆఫీస‌ర్‌గా మేధా రెడ్డి యాక్టింగ్ ఒకే. బ‌ల‌గం ఫేమ్ రూప‌ల‌క్ష్మి నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించింది. రూప‌ల‌క్ష్మితో పాటు మెయిన్ విల‌న్‌గా న‌టించిన సూర్య శ్రీనివాస్ పాత్ర‌ల‌కు సంబంధించి వ‌చ్చే ట్విస్ట్‌లు ఈ సిరీస్‌కు హైలైట్‌గా నిలిచాయి. కొడుకు కోసం త‌ల్ల‌డిల్లే తండ్రిగా శివాజీరాజా పాత్ర నిడివి త‌క్కువే అయినా త‌న యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నారు. చ‌ర‌ణ్ బాబు, శ్రీజ‌, రాధికా ప్రీతి త‌మ ప‌రిధుల మేర మెప్పించారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: మెడిక‌ల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు. సినిమాకు ఏ మాత్రం త‌గ్గ‌కుండా చివ‌రి వ‌ర‌కు ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేశాడు. స్క్రీన్‌ప్లే చాలా ప్రెడిక్ట‌బుల్‌గా ఉంది. వావ్ అని ఆడియెన్స్ భావించే మ‌లుపులు ఈ సిరీస్‌లో లేవు.

న‌రేష్ కుమ‌ర‌న్ బీజీఎమ్ క్రైమ్ ఫీల్‌ను ఎలివేట్ చేసింది. సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉద‌య‌భాను, విజ‌యేంద్ర‌మౌళి ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి. సందీప్ కాంత్ సినిమాటోగ్ర‌ఫీ, శ్రీనివాస్ ఎడిటింగ్ బాగున్నాయి.

విశ్లేష‌ణ‌: ఓటీటీలో క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌కు ఆద‌ర‌ణ ఎక్కువ‌. ఈ క్రైమ్ క‌థ‌ల‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయ‌డంలో మ‌ల‌యాళ ద‌ర్శ‌కులు సిద్ద‌హ‌స్తులు. చిన్న పాయింట్‌ల‌తో ఎంగేజింగ్‌గా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తెర‌కెక్కిస్తుంటారు. పంచ‌నామా వెబ్‌సిరీస్‌తో మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ ఫార్ములాను ఫాలో అయ్యాడు డైరెక్ట‌ర్ మోహ‌న్ శ్రీవాత్స‌. ఎలాంటి ఆధారాలు లేని ఓ మ‌ర్డ‌ర్‌తో క‌థ‌ను మొద‌లుపెట్టి…పెద్ద మెడిక‌ల్ మాఫియా గుట్టును ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా బ‌య‌ట‌పెట్టాడ‌నే అంశాల‌తో చివ‌రి వ‌ర‌కు ఈ సిరీస్‌ను న‌డిపించాడు.

త‌మ వ్యాపారం కోసం కొన్ని ఫార్మా కంపెనీలు డ‌బ్బు ఆశ చూపి అమాయ‌కుల ప్రాణాల‌తో ఎలా చెల‌గాట‌మాడుతున్నాయి? హ్యుమ‌న్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ వ‌ల్ల ఎలాంటి న‌ష్టాలు ఉంటాయి? వైద్యం పేరుతో కొంద‌రు డాక్ట‌ర్లు ఆర్గాన్ ట్రాఫికింగ్‌కు ఎలా పాల్ప‌డుతున్నార‌న్న‌ది ఈ సిరీస్‌లో చూపించారు. కేవ‌లం క్రైమ్ ఎలిమెంట్‌కు ప‌రిమితం కాకుండా అన్న‌ద‌మ్ములు, అక్క త‌మ్ముళ్ల బంధాన్ని అంత‌ర్లీనంగా ట‌చ్ చేశారు.
క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాలు, సిరీస్‌ల‌ను ఎక్కువ‌గా చూసే ఆడియెన్స్ ఇందులో విల‌న్ ఎవ‌ర‌న్న‌ది ఈజీగానే గెస్ చేస్తారు. క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ సీన్లు కూడా కొత్త‌గా లేవు. అస‌లు విల‌న్ ఎవ‌ర‌న్న‌ది రివీల‌య్యే ఎపిసోడ్‌తో క‌థ‌ను ముగించ‌డంతో ఇన్ కంప్లీట్ ఫీల్‌ను క‌లిగిస్తుంది.

ఫోక‌స్ పాయింట్‌: పంచ‌నామా…డీసెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌. ర‌న్ టైమ్ త‌క్కువే. పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోకుండా చూస్తే మెప్పిస్తుంది.

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharath Srinivasan
  • #Medha Reddy
  • #Shivaji Raja
  • #Udaya bhanu

Reviews

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

24 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

13 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

20 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

21 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

22 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version