Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Reviews » Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

  • June 25, 2025 / 03:47 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Cast & Crew

  • జితేంద్ర కుమార్ (Hero)
  • నేనా గుప్తా (Heroine)
  • రఘుబీర్ యాదవ్బి,శ్వపతి సర్కార్, సునీత రాజ్వార్, శాన్విక (Cast)
  • దీపక్ కుమార్ మిశ్రా - అక్షత్ (Director)
  • ది వైరల్ ఫీవర్ (Producer)
  • అనురాగ్ సైకియా (Music)
  • అమితాబా సింగ్ (Cinematography)
  • అమిత్ కులకర్ణి (Editor)
  • Release Date : జూన్ 24, 2025
  • TVF (Banner)

2020 కరోనా లాక్ డౌన్ టైంలో TVF సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన “పంచాయత్” (Panchayat) నచ్చని వారు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అప్పటివరకు సిరీస్ అంటే శృంగారం, హింస, బూతులు అని అలవాటుపడుతున్న తరుణంలో.. అసభ్యతకు తావులేకుండా తెరకెక్కిన “పంచాయత్” అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. సెకండ్ సీజన్ కోసం జనాలు గట్టిగానే వెయిట్ చేశారు. 3వ సీజన్ కి వచ్చేసరికి కాస్త సాగదీసిన భావన కలిగింది. మరి సరైన ముగింపు ఇవ్వని 4వ సీజన్ అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. మరి ఈ 4వ సీజన్ ఎలా ఉంది? సిరీస్ ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసిందా? అనేది చూద్దాం..!!

Panchayat Season 4 Review

panchayath review6

కథ: పథాన్ జీ (రఘుబీర్ యాదవ్) మీద జరిగిన హత్యా ప్రయత్నంతో ముగిసిన సీజన్ 3 నుంచి సీజన్ 4 కంటిన్యూ అయ్యింది. ఎమ్మెల్యే కారణంగా ప్రధాన మరియు సెక్రటరీ అభిషేక్ త్రిపాఠి (జితేందర్) ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనేది చూపిస్తూనే.. ఫులేరా గ్రామంలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ హంగామా మొదలవుతుంది.

ఈ రచ్చలో ఎవరు గెలిచారు? ఇంతకీ ప్రధాన్ జీ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “పంచాయత్ సీజన్ 4”.

panchayath review4

నటీనటుల పనితీరు: నటీనటులుగా ఎవరెలా నటించారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ సిరీస్ ప్రసారమైనప్పటినుంచి ప్రతి ఒక్క నటుడు పాత్ర పేరుతోనే గుర్తుండిపోయాడు. చాలామంది సీనియర్ నటులకైతే సినిమాలంటే ఈ సిరీస్ తోనే ఎక్కువ పేరు వచ్చింది.

అయితే.. మొదటి రెండు సీజన్లు ఆసక్తికరంగా సాగిన పాత్రలు.. 3వ సీజన్ నుంచి మాత్రం బోర్ కొట్టదా మొదలుపెట్టాయి. ముఖ్యంగా అపోజిషన్ టీమ్ మెంబర్స్ క్యారెక్టర్ కి ఒక రీజనింగ్ లేకపోవడంతో వాళ్ల చేష్టలు వెగటు పుట్టించాయి.

panchayath review2

సాంకేతికవర్గం పనితీరు: రచయితలు, దర్శకులకు ఈ సిరీస్ క్రేజ్ ను వాడుకుందామనే తపనే ఎక్కువగా ఉంది తప్పితే.. మంచి ముగింపు ఇద్దామనే ఆలోచన మాత్రం 8 ఎపిసోడ్లలో ఎక్కడా కనిపించలేదు. పాత్రలను, సందర్భాలను సాగదీసిన విధానం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడమే కాక, సిరీస్ మీద ఉన్న అభిమానాన్ని కూడా పోగొడుతుంది. మరి వైరల్ ఫీవర్ లాంటి సంస్థ ఈ విధమైన డెసిషన్ తీసుకుంది అనే ఆలోచనే ఇబ్బందిపెడుతుంది. కంటెంట్ క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అతి తక్కువ సంస్థల్లో TVF ఒకటి, వాళ్లు తమ తదుపరి సిరీస్ ల విషయంలో ఇలా వ్యవహరించరు అని నమ్మడం తప్ప ఏమీ చేయలేం.

ఇకపోతే.. టెక్నికల్ గా సిరీస్ మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ వంటివన్నీ డీసెంట్ గా ఉన్నాయి. అయితే.. వీటన్నిటినీ ఆసక్తికరంగా నడిపించాల్సిన కథ-కథనంలో పట్టు లోపించడంతో, ఇవేమీ ఎలివేట్ అవ్వలేదు.

panchayath review3

విశ్లేషణ: ఒక సినిమా లేదా సిరీస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది అంటే.. దాని కొనసాగింపు మరింత ఆసక్తికరంగా ఉండాలే కానీ, ఏదో సదరు సిరీస్ యొక్క క్రేజ్ ను వాడుకోవడం కోసం సాగదీయకూడదు. కానీ “పంచాయత్” విషయంలో జరిగింది అదే. ఎలాంటి అసభ్యత లేకపోయినా మరీ సీరియల్ లా సాగిన ఈ 4వ సీజన్ సాధారణ ప్రేక్షకులనే కాదు, సదరు సిరీస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకోలేదు. కాకపోతే.. సెన్సిబిలిటీస్ & స్వీట్ కామెడీ కోసం సరదాగా చూడొచ్చు.

panchayath review5

ఫోకస్ పాయింట్: ఈ పంచాయితీని ఇంకా సాగదీయకపోవడం బెటర్!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Panchayat
  • #Panchayat Season 4

Reviews

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

1 day ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version