Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 17, 2026 / 09:19 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • తిరువీర్‌ (Hero)
  • పాయ‌ల్ రాధాకృష్ణ‌ (Heroine)
  • అజ‌య్ ఘోష్‌, రాశి, గోప‌రాజు ర‌మ‌ణ‌, దేవీప్ర‌సాద్‌, ప్ర‌సాద్ బెహ‌రా త‌దిత‌రులు (Cast)
  • దుర్గా న‌రేష్‌ (Director)
  • రుద్ర‌దేవ్ మాదిరెడ్డి, రాకేష్ రెడ్డి గ‌డ్డం (Producer)
  • కేఎం రాధాకృష్ణ‌న్‌ (Music)
  • ఎస్వీ విశ్వేశ్వ‌ర్‌ (Cinematography)
  • అన్వ‌ర్ అలీ (Editor)
  • Release Date : 17th ఏప్రిల్ 2026
  • ఈటీవీ విన్ & కృషి ఎంటర్టైన్మెంట్స్ (Banner)

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో తిరువీర్‌. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో స‌క్సెస్ త‌ర్వాత మ‌రోసారి కామెడీ క‌థ‌తో తిరువీర్ చేసిన సినిమా ప్రాపం ప్ర‌తాప్‌ (Papam Prathap). పాయ‌ల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు దుర్గా న‌రేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈటీవీ విన్ ఓటీటీతో క‌లిసి రుద్ర‌దేవ్ మాదిరెడ్డి, రాకేష్ రెడ్డి గ‌డ్డం ఈ సినిమాను నిర్మించారు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? కామెడీ క‌థ‌తో తిరువీర్ మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడా? లేదా? అంటే?

Papam Prathap Movie Review

క‌థ‌: ప్ర‌తాప్ (తిరువీర్‌) చిన్న‌ప్ప‌టి నుంచి బుజ్జ‌మ్మ‌ను (పాయ‌ల్ రాధాకృష్ణ‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. తండ్రి వీర‌య్య‌కు (అజ‌య్ ఘోష్‌) ఇష్టం లేక‌పోయినా త‌ల్లి (రాశి) అండ‌తో బుజ్జ‌మ్మను పెళ్లి చేసుకుంటాడు. శోభ‌నం మూడురాత్రులు ముగియ‌గానే ప్ర‌తాప్‌కు వ్య‌తిరేకంగా పెద్ద మ‌నుషుల ముందు పంచాయితీ పెడుతుంది బుజ్జ‌మ్మ‌. ప్ర‌తాప్‌కు ఓ స‌మ‌స్య ఉంద‌ని అదేమిటో తెలుసుకోవ‌డ‌మే కాకుండా దానిని స‌రిదిద్దుకున్న త‌ర్వాతే త‌న వ‌ద్ద‌కు ర‌మ్మ‌ని భ‌ర్త‌తో అంటుంది. అప్ప‌టివ‌ర‌కు తాను పుట్టింటిలోనే ఉంటాన‌ని వెళ్లిపోతుంది ప్ర‌తాప్ స‌మ‌స్య‌పై ఊళ్లో ర‌క‌ర‌కాల పుకార్లు వినిపిస్తాయి. చివ‌ర‌కు బుజ్జ‌మ్మ ద్వారానే త‌న‌కున్న స్లీపింగ్ డిజార్డ‌ర్‌ గురించి ప్ర‌తాప్‌కు ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. అదేమిటి? ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య‌ను అత‌డు ఎందుకు కొట్టాడు? ప్ర‌తాప్ పిచ్చాసుప‌త్రిలో చేర‌డానికి కార‌ణ‌మేమిటి? బుజ్జ‌మ్మ‌పై ప్రేమ అత‌డిని తిరిగి మామూలు మ‌నిషిని చేసిందా? వారిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారా? అన్న‌దే పాపం ప్ర‌తాప్ మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: స్లీపింగ్ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డే ప్రేమికుడి పాత్ర‌లో తిరువీర్ న‌ట‌న బాగుంది. డిఫ‌రెంట్ మ్యాన‌రిజ‌మ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ బాగుంది. పాయ‌ల్ రాధాకృష్ణ ఎమోష‌న‌ల్ రోల్‌లో మెప్పించింది. హీరో తండ్రిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో అజ‌య్ ఘోష్ క‌నిపించారు. త‌న‌దైన మార్కు డైలాగ్ డెలివ‌రీ, పంచ్‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. త‌ల్లి క్యారెక్ట‌ర్‌కు రాశి న్యాయం చేసింది. గోప‌రాజు ర‌మ‌ణ‌, ర‌ఘుబాబు, ప్ర‌సాద్ బెహ‌రా కామెడీ చాలా వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అయ్యింది. దేవిప్ర‌సాద్‌, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌మ ప‌రిధుల మేర ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు: దుర్గా న‌రేష్ డైరెక్ట‌ర్‌గానే కాకుండా రైట‌ర్‌గా మెప్పంచాడు. తొలి సినిమానే అయినా అనుభ‌వ‌జ్ఞుడిలా తెర‌కెక్కించారు. సినిమా కోసం అత‌డు ఎంచుకున్న పాయింట్ కొత్త‌గా ఉంది. కేఎమ్ రాధాకృష్ణ‌న్ మ్యూజిక్ బాగుంది. మెలోడీ సాంగ్ తో పాటు పిక్చ‌రైజేష‌న్ కూడా బ్యూటీఫుల్‌గా సాగింది. ప‌ల్లెటూరి అందాల‌ను సినిమాటోగ్రాఫ‌ర్ విశ్వేశ్వ‌ర్ చ‌క్క‌గా చూపించారు. ఈటీవీ విన్ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ సినిమాకు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

విశ్లేష‌ణ‌: ప్రేమ‌క‌థ‌కు స్లీపింగ్‌ డిజార్డ‌ర్ అనే స‌మ‌స్య‌ను జోడించి ద‌ర్శ‌కుడు దుర్గా న‌రేష్ పాపం ప్ర‌తాప్ (Papam Prathap) క‌థ‌ను రాసుకున్నారు. కొన్ని స‌మ‌స్య‌ల‌కు ట్రీట్‌మెంట్ అంటూ ఉండ‌దు… ప్రేమ నిజ‌మైన మెడిసిన్‌లా ప‌నిచేస్తుంద‌నే సందేశాన్ని ఎంట‌ర్‌టైనింగ్‌గా చెప్పారు. ప్ర‌తాప్…. బుజ్జ‌మ్మ పెళ్లితోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత వారిద్ద‌రి ల‌వ్‌స్టోరీని క్యూట్‌గా ప్ర‌జెంట్ చేశారు. ఎప్పుడైతే ప్ర‌తాప్‌ను వ‌దిలేసి బుజ్జ‌మ్మ వెళ్లిపోతుందో అక్క‌డి నుంచే సినిమా అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.

ప్ర‌తాప్‌కు ఉన్న స‌మ‌స్య విష‌యంలో ఊరివాళ్లు ర‌క‌ర‌కాల పుకార్లు సృష్టించ‌డం… ఆ క్ర‌మంలో వ‌చ్చే కామెడీతో ఫ‌స్ట్ హాఫ్ హిలేరియ‌స్‌గా సాగుతుంది. ముఖ్యంగా అజ‌య్ ఘోష్‌, గోప‌రాజు ర‌మ‌ణ మ‌ధ్య వ‌చ్చే ఫ‌న్ ఎపిసోడ్స్ క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. ష‌కీలా సినిమా సీన్, ర‌ఘు మ‌ధ్య వ‌ర్తిత్వం ఎపిసోడ్ బాగా పేలాయి. ప్ర‌తాప్ వేసే ప్లాన్స్ మొత్తం ఫెయిల‌వ్వ‌డం, చివ‌ర‌కు తండ్రి ముందు బుక్క‌య్యే సీన్స్ నుంచి చ‌క్క‌టి వినోదాన్ని రాబ‌ట్టుకున్నారు డైరెక్ట‌ర్‌.

ఇంట‌ర్వెల్ టైమ్‌లో త‌న‌కున్న డిజార్డ‌ర్ గురించి ప్ర‌తాప్‌కు తెలిసే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. త‌న‌ స‌మ‌స్య‌.. ప్రేమ‌కు అడ్డంకిగా మారింద‌ని తెలిసి ప్ర‌తాప్ ఏం చేశాడ‌న్న‌ది ఎమోష‌న‌ల్‌గా చూపించారు. ఓవ‌ర్ మెలో డ్రామాకు వెళ్ల‌కుండా కామెడీ, భావోద్వేగాల‌ను రెండింటిని చ‌క్క‌గా బ్యాలెన్స్ చేశారు. త‌న స‌మ‌స్య త‌గ్గిపోయింద‌ని ఊరివాళ్ల‌ముందు నిరూపించే క్ర‌మంలో వ‌చ్చే ర‌చ్చ‌బండ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. క్లైమాక్స్ క‌న్వీన్సింగ్‌గా అనిపిస్తుంది.

1990 బ్యాక్‌డ్రాప్ పాపం ప్ర‌తాప్ (Papam Prathap) క‌థ‌కు ప్రాణం పోసింది. అప్ప‌ట్లో ర‌చ్చ‌బండ రూమ‌ర్లు, ఊళ్లో పంచాయితీలు, గొడ‌వ‌లు ఎలా ఉండేవ‌న్న‌ది స‌హ‌జంగా చూపించారు. అవ‌న్నీ ఆనాటి వాతావ‌ర‌ణంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ‌తాయి. హీరోకు ఆ స‌మ‌స్య ఎలా వ‌చ్చింద‌నే ఫ్లాష్‌బ్యాక్‌ను ఇంకాస్త డెప్త్‌గా చూపిస్తే బాగుండేది. ఆ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం హీరో చేసే ప్ర‌య‌త్నాల్లో ఆస‌క్తి లోపించింది. హీరోయిన్‌ను హీరో ఎందుకు అంత ఇష్ట‌ప‌డ్డాడు అన్న‌ది స‌రిగ్గా ఎస్టాబ్లిష్ చేయ‌లేదు. చిన్న చిన్న లోపాల క‌వ‌ర్ చేసుకొని ఉండుంటే సినిమా రిజ‌ల్ట్ మ‌రోలా ఉండేది.

ఫోక‌స్ పాయింట్‌: ప్ర‌తాప్ క‌ష్టాల‌న్నీ కామెడీనే.. మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay ghosh
  • #Papam Prathap Movie
  • #Payal Radhakrishna
  • #Thiruveer

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

9 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

11 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

17 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 days ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 days ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version