Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

అర్జున్ అంబటి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుని.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అలా అని స్మాల్ స్క్రీన్ ని, ఓటీటీ కంటెంట్ ని వదలడం లేదు.

Paramapadha Sopanam Trailer

ఓ పక్క ‘పెద్ది’ వంటి పెద్ద సినిమాలో అత్యంత కీలక పాత్ర చేస్తూనే మరోపక్క హీరోగా ‘పరమపద సోపానం'(Paramapadha Sopanam) అనే యాక్షన్ మూవీని కూడా ఫినిష్ చేశాడు అర్జున్ అంబటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి దర్శకుడు.

‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా… పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఏప్రిల్ 24న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసిన డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ‘చిన్ని చిన్ని తప్పులేవో’ ‘భూమ్ భూమ్’ వంటి పాటలకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ లభించింది. టీజర్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.విడుదల తేదీ దగ్గర పడుతుండుతున్న నేపధ్యంలో ప్రమోషన్స్ డోస్ ని మరింత పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ట్రైలర్ ని వదిలారు.’కింగ్ ఆఫ్ కంటెంట్’ శ్రీవిష్ణు చేతుల మీదుగా ‘పరమపద సోపానం’ ట్రైలర్ విడుదలైంది.

ఇందులో భాగంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఇప్పుడే ‘పరమపద సోపానం’ ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం అనే ఫీలింగ్ ఇచ్చింది. అర్జున్ అంబటి హీరోగా ఈ సినిమాతో పెద్ద కొట్టాలి. దర్శకుడు నాగ శివ కూడా నాకు చాలా కాలంగా తెలుసు. టాలెంటెడ్ డైరెక్టర్, మంచి హార్డ్ వర్కర్ కూడా.! ఈ సినిమాతో అతనికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను.’పరమపద సోపానం’ సినిమాకి పనిచేసిన వారందరికీ ఆల్ ది బెస్ట్” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ‘పరమపద సోపానం’ ట్రైలర్ విషయానికి వస్తే.. యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఓ సోషల్ ఎలిమెంట్ ను కూడా దర్శకుడు నాగ శివ టచ్ చేసినట్టు కనిపిస్తుంది. అర్జున్ అంబటి యాక్షన్ సీన్స్ లో గ్రేస్ చూపించాడు. రొమాంటిక్ సన్నివేశాలు, బీచ్ సీక్వెన్స్..లు చూస్తుంటే దర్శకుడు నాగ శివ తన గురువు పూరీ జగన్నాథ్ స్టయిల్ ని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ట్రైలర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus