INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

Advertisement

జాతీయ స్థాయిలో జరిగిన INCA Awards 2026 వేడుకలో ఈసారి తెలుగు సినిమా ఘన విజయాన్ని సాధించింది. ముంబయి వేదికగా అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల మధ్య టాలీవుడ్ తన ప్రత్యేక గుర్తింపును మరింత చాటుకుంది. నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఇలా పలు విభాగాల్లో తెలుగు సినిమా సత్తాను మరోసారి నిరూపించారు.

INCA Awards 2026

ఈ ఈవెంట్‌లో సినీ తారలు రానా దగ్గుబాటి, శ్రియ శరన్, కరణ్ జోహార్ హోస్టింగ్‌తో వేడుక మరింత సందడిగా మారింది. సౌత్ నుంచి నార్త్ వరకు ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు అమితమైన ఆనందాన్నిపంచింది.

అవార్డుల పరంగా చూస్తే, యువ సామ్రాట్ నాగ చైతన్య తన నటనతో ‘తండేల్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం ప్రధాన హైలైట్‌గా నిలిచింది. అదే సమయంలో ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి గాను రష్మిక మందన ఉత్తమ నటిగా ఎంపికై మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఎంటర్టైన్మెంట్ జానర్ లో తనదైన స్టైల్ లో హిట్స్ కొడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నిలవడం టాలీవుడ్‌ గర్వించదగ్గ విషయం. ఇదే సినిమాకు గాను యంగ్ టాలెంట్ మాస్టర్ రేవంత్ కామెడీ విభాగంలో అవార్డు అందుకోవడం విశేషం.

సాంకేతిక విభాగాల్లో కూడా తెలుగు సినిమాలే పైచేయి సాధించాయి. “మిరాయ్” చిత్రం ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో కూడా గుర్తింపు పొందింది. కొత్త దర్శకులకు ప్రోత్సాహం అందిస్తూ, ‘కోర్ట్’ సినిమాకు గాను తొలి చిత్రంతోనే ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రామ్ జగదీష్ అవార్డు అందుకోవడం ప్రోత్సాహకర పరిణామం. మొత్తానికి, ఈసారి INCA అవార్డ్స్‌లో తెలుగు సినిమా అన్ని విభాగాల్లో మెరిసి, జాతీయ స్థాయిలో తన సత్తాను మరోసారి నిరూపించుకుంది.

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus