టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకడైన పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే. అయితే అలాంటి పూరీ సొంత తమ్ముడినే తన వద్ద అసిస్టెంట్ గా పెట్టుకోవాడానికి ఒప్పుకోలేదట….అయితే అసలు ఏం జరిగింది..ఎందుకు ఒప్పుకోలేదు అంటే…మాత్రం ఈ కధ తెలియాల్సిందే… యువత, సోలో, శ్రీరస్తుశుభమస్తు లాంటి ఫీల్ గుడ్ మూవీస్ ను డైరెక్ట్ చేసిన పరశురామ్ మన పూరీ దగ్గర అసిస్టెంట్ మాత్రమే కాదంట స్వయాన తమ్ముడు కూడా….స్వతహాగా ఎంబీయే చదివిన పరశురామ్ అనుకోని పరిస్తితుల్లో తన తల్లి చనిపోతే దాదాపుగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే క్రమంలో హైదరాబాద్ వచ్చి ఏదైన ఉద్యోగం చేసుకోవాలి అని అనుకున్నాడంటా.
అయితే అదే సమయంలో ‘ఇడియట్’ సినిమా సూపర్ హిట్ అయ్యీ పూరీ మంచి ఫార్మ్ లో ఉండడంతో ఎలా అయినా ఆయన దగ్గర చేరి డైరెక్షన్ నేర్చుకోవాలి అని అనుకున్నాడట. తన అన్న అయిన పూరీ వద్దకు వెళ్ళి విషయం చెప్పగానే….పూరీ గట్టిగా తిట్టి…ఎంబీయే చేసి ఫారిన్ వెళ్తానన్నావు కదా.. ఏమైంది అంటూ తనే ఫారిన్ పంపించే ఏర్పాట్లు చేస్తానన్నాడు అని పరశురామ్ చెప్పాడు. అయినా వినకపోవడంతో….దీంతో కోపమొచ్చి పూరీ కొన్ని రోజులు తమ్ముడితో మాట్లాడ్డం మానేశాడు అని తెలిపాడు.
ఆ తర్వాత పరశురామ్ తన తండ్రితో ఓసారి చెప్పించాక….ఆయన మాట కాదనలేక అసిస్టెంటుగా చేర్చుకున్నాడట పూరీ. అదే క్రమంలో పరశురామ్ తన కరియర్ గురించి చెబుతూ….ఆంధ్రావాలా.. 143 సినిమాలకు పని చేసిన తరువాత …..దశరధ్ దగ్గర చేరాడట. దశరధ్ వద్ద….‘శ్రీ’ సినిమాకు పని చేసిన తరువాత….‘పరుగు’ సినిమాకు అడిషనల్ డైలాగ్స్.. స్క్రిప్టు సహకారం అందించాడట. ఇక ఆ తర్వాత ‘యువత’తో దర్శకుడయ్యే అవకాశం దక్కింది’’ అని పరశురామ్ చెప్పాడు. ఏది ఏమైనా…పరశురామ్ కరియర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనే చెప్పాలి.