ప్రేమించిన అమ్మాయినో, అబ్బాయినో పెళ్లి చేసుకోవాలని కూర్చుంటే ఈ ప్రపంచంలో సగం మందికి, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువమందికే పెళ్లిళ్లు కావు అంటారు. ఎందుకంటారు, ఆ సంగతేంటి అనేది ఇప్పుడు అప్రస్తుతం కానీ… బాలీవుడ్లో పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంటలో కథానాయిక గురించి, ఆమె గత ప్రేమకథల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్లో ఎంత ప్రయత్నించినా స్టార్ హీరోయిన్ అవ్వడానికి ఇబ్బందిపడుతున్ పరిణీతి ఇప్పుడు పెళ్లి కూతురు అయ్యింది.
ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణీతి ఈ నెల 24న పెళ్లి చేసుకోబోతోంది. రాజస్థాన్ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఈ ఇద్దరూ ఒక్కటికాబోతున్నారు. రాఘవ్ చద్దా, పరిణీతికి ప్రేమ పెళ్లి అనే విషయం తెలిసిందే. అయితే ఆ ప్రేమకు ముందు పరిణీతి లైఫ్‌లో ఇంకొన్ని ప్రేమలు ఉన్నాయి. అయితే వీటిలో ఏవీ అఫీషియల్‌గా చెప్పలేదు, అలాగని నో కూడా చెప్పలేదు. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
* నటుడు ఉదయ్ చోప్రాతో పరిణీతి ప్రేమలో ఉందని వార్తలు రావడానికి కారణం ‘ఇష్క్ జాదే‘. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల సందర్భంగా వీరద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని టాక్. ఆ తర్వాత ఇద్దరూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు. అయితే తాము స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చేసి దూరమయ్యారు.
* దర్శకుడు మనీష్ శర్మతో పరిణీతి చోప్రా ప్రేమాయణం నడిపినట్లు వార్తలొచ్చాయి. ‘శుద్ధ దేశీ రొమాన్స్’, ‘లేడీస్ వర్సెస్ రికీబల్’ అనే సినిమాలు చేశారు. ఆ సమయంలో పార్టీలు, పబ్బులకు వెళ్తూ మీడియా కంట పడ్డారు. అయితే ఈ ప్రేమ కహానీ కొద్ది రోజులే కనిపించింది.
* ‘కోడ్ నేమ్ తిరంగ’ అనే సినిమాలో పరిణీతి, హార్డీ సంధు నటించారు. ఆ సందర్భంగా ఈ ఇద్దరూ ఓసారి డిన్నర్ డేట్‌కి వెళ్లారు. దీంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు వచ్చేశాయి.
* పరిణీతి చోప్రా (Parineeti Chopra) ‘లేడీస్ వర్సెస్ రికీబల్’ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. ఆ తర్వాత అర్జున్ కపూర్‌తో ‘ఇష్క్ జాదే’ సినిమాలో నటించింది. ఆ చిత్రంలో వీరి కెమిస్ట్రీ చూసి ఇద్దరూలో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై ఇరువురూ స్పందించలేదు.
* ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలసి నటించింది పరిణీతి. అయితే ఆ సమయంలో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు పుట్టించారు. అయితే పరిణీతి ఆ పుకార్లను ఖండించింది.
* ప్రియాంక చోప్రా ప్రీ వెడ్డింగ్ బాష్‌లో చరిత్ దేశాయ్ అఏ వ్యక్తితో క్లోజ్‌గా ఉంటూ కొన్ని ఫొటోల్లో కనిపించి పరిణీతి చోప్రా. కొంతకాలం ఇద్దరు హ్యాపీగానే ఉన్నా… అనుకోని కారణాలతో విడిపోయారు అని సమాచారం.