‘రూమర్స్’పై ఓపెన్ అయిపోయింది!!!

Advertisement

పరిణీతి చోప్రా…ఈ బాలీవుడ్ భామ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే అసలే సినిమా ఫీల్డ్ లో అనేక రూమర్స్ కు ఆస్కారం ఎక్కువ, ఎందుకంటే అంతా గ్లామర్ ప్రపంచం కదా. అయితే అదే క్రమంలో బాలీవుడ్ సంగతే తీసుకుంటే అక్కడ సెన్సార్ సైతం సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు హీరో హీరోయిన్స్. ఇదిలా ఉంటే అందరూ అలా ఉంటారు అని అనుకుంటే మనదే తప్పు అవుతుంది.

విషయంలోకి వెళితే….అందాల భామ పరిణీతి చోప్రా పై అనేక రూమర్స్ వస్తున్నాయి…వీటిలో మనీష్ శర్మ.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లతో అఫైర్ అంటూ ఎక్కువ సార్లు వినిపించింది. మీడియాలో వస్తున్న ఈ రూమర్స్ పై మాట్లాడుతూ ఓపెన్ అయిపోయింది ఈ భామ…..అసలు ఇంతకీ అందులో ఏ రూమర్ కరెక్ట్ అంటే….ఆమె మాట్లాడుతూ…’ నేను ఇలాంటి రూమర్లను చాలా సార్లే విన్నాను. నాకు మనీష్ తో ఆరేళ్లుగా పరిచయం ఉంది. మేము డేటింగ్ లో లేమని చాలాసార్లు చెప్పాను. నేను రోజూ ఆదిత్యచోప్రా ఆఫీస్ లో మనీశ్ క్యాబిన్ కి వెళ్లి అతన్ని కలుస్తున్నానని రాస్తున్నారు.

తనకు ఆ ఆఫీసులో క్యాబిన్ ఎక్కడుందని మనీష్ నన్నే అడుగుతున్నాడు’ అని నిలదీసింది. అంతేకాదు..సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో నాకు లవ్ అఫైర్ పై వచ్చిన పుకార్లపై కూడా స్పందిస్తూ…ఓ ఏడాదిగా అతన్ని నేను ఒకసారి కూడా కలవలేదు. ఓ నైట్ సుశాంత్ తో గడిపాక.. నాతో బ్రేకప్ అయి వెళ్లిపోయాడని రాశారు. నేను సుశాంత్ చివరగా మాట్లాడినదే నాకు గుర్తులేదు. ఇలా మీ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటూ పోతే….మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసా అంటూ మీడియాను కడిగి పారేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus