తొలి ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో.. తొలి ముద్దు అంతకంటే మధురంగా ఉంటుందంటారు. అందుకే తొలి ముద్దు జ్ఞాపకాన్ని ఎవరూ అంత త్వరగా మరచిపోరు. సాధారణ ప్రజలు తొలి ప్రేమ, తొలి ముద్దు కేవలం జ్ఞాపకాలు అయితే… సినిమా నాయికల ఆ ‘తొలి’ అనుభవాలు ఆసక్తికరమైన విశేషాలు. అందుకే అప్పుడప్పుడు బయటకు వచ్చే ఈ విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తొలి ముద్దు అనుభవం వార్త వైరల్‌గా మారింది.
ఇటీవల ఓ సినిమా ప్రచారంలో పాల్గొన్న పరిణీతి చోప్రాను తొలి ముద్దు అనుభవం, తొలి డేట్ గురించి అడిగారు. దానికి పరిణీతి చెప్పిన సమాధానం కుర్రకారుకు కిర్రెక్కించింది. ఎందుకంటే ఇప్పటివరకు పరిణీతి తొలి ముద్దు అనుభవం 18 ఏళ్ల వయసులోనే జరిగిందట. ఆ వయసులోనే ఒక కుర్రాణ్ని ముద్దు పెట్టుకున్నానని చెప్పింది. అయితే ముద్దు విషయంలో ఇంత క్లియర్‌గా చెప్పిన పరిణీతి… ఇప్పటివరకు డేట్‌కి వెళ్లలేదని చెప్పింది. మరి డేట్‌కి వెళ్లకుండా ఈ ముద్దు ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
చిన్నతనంలో పరిణీతికి సైఫ్ అలీఖాన్ అంటే చాలా ఇష్టమట. అతణ్ని ఆ రోజుల్లో చాలా ప్రేమించానని చెప్పుకొచ్చింది. దీంతోపాటు తన తొలి సినిమా విడుదల సమయంలో జరిగిన ఓ విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది పరిణీతి. లేడీస్ వర్సెస్ రిక్కీబెల్’ విడుదలైన తర్వాత ఓ అభిమాని నుండి పరిణీతికి ఓ గిఫ్ట్ వచ్చిందట. అందులో అన్నీ లేఖలే ఉన్నాయట. అందుకే ఆ గిఫ్ట్ తనకి ఎంతో ప్రత్యేకం అనిపించిందట.