‘ముద్దు’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన ‘చోప్రా’ బేబీ

  • March 2, 2021 / 03:53 PM IST

తొలి ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో.. తొలి ముద్దు అంతకంటే మధురంగా ఉంటుందంటారు. అందుకే తొలి ముద్దు జ్ఞాపకాన్ని ఎవరూ అంత త్వరగా మరచిపోరు. సాధారణ ప్రజలు తొలి ప్రేమ, తొలి ముద్దు కేవలం జ్ఞాపకాలు అయితే… సినిమా నాయికల ఆ ‘తొలి’ అనుభవాలు ఆసక్తికరమైన విశేషాలు. అందుకే అప్పుడప్పుడు బయటకు వచ్చే ఈ విషయాలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా తొలి ముద్దు అనుభవం వార్త వైరల్‌గా మారింది.

ఇటీవల ఓ సినిమా ప్రచారంలో పాల్గొన్న పరిణీతి చోప్రాను తొలి ముద్దు అనుభవం, తొలి డేట్‌ గురించి అడిగారు. దానికి పరిణీతి చెప్పిన సమాధానం కుర్రకారుకు కిర్రెక్కించింది. ఎందుకంటే ఇప్పటివరకు పరిణీతి తొలి ముద్దు అనుభవం 18 ఏళ్ల వయసులోనే జరిగిందట. ఆ వయసులోనే ఒక కుర్రాణ్ని ముద్దు పెట్టుకున్నానని చెప్పింది. అయితే ముద్దు విషయంలో ఇంత క్లియర్‌గా చెప్పిన పరిణీతి… ఇప్పటివరకు డేట్‌కి వెళ్లలేదని చెప్పింది. మరి డేట్‌కి వెళ్లకుండా ఈ ముద్దు ఏంటి అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

చిన్నతనంలో పరిణీతికి సైఫ్‌ అలీఖాన్‌ అంటే చాలా ఇష్టమట. అతణ్ని ఆ రోజుల్లో చాలా ప్రేమించానని చెప్పుకొచ్చింది. దీంతోపాటు తన తొలి సినిమా విడుదల సమయంలో జరిగిన ఓ విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది పరిణీతి. లేడీస్‌ వర్సెస్‌ రిక్కీబెల్‌’ విడుదలైన తర్వాత ఓ అభిమాని నుండి పరిణీతికి ఓ గిఫ్ట్‌ వచ్చిందట. అందులో అన్నీ లేఖలే ఉన్నాయట. అందుకే ఆ గిఫ్ట్‌ తనకి ఎంతో ప్రత్యేకం అనిపించిందట.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus