తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు తర్వాత ఎక్కువగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న హీరో అల్లు అర్జున్. కోల్ గేట్, రెడ్ బస్, ఓఎల్ఎక్స్, లాట్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ లాంటి అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తన యాక్టింగ్ తో యాడ్స్ ని అందరూ చూసేలా చేస్తున్నారు. అల్లు అర్జున్ వల్ల వ్యాపారం పెరుగుతుండడంతో.. ఇతర కంపెనీ వాళ్ళు బన్నీ కోసం క్యూ కడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ మ్యాంగో ఫ్రూటీకి బ్రాండ్ అంబాసిడర్ గా సంతకాలు చేశారు. పార్లేకి చెందిన ఫ్రూటీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు అంగీకరించారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఫ్రూటీ యాడ్, హోర్డింగ్స్ లో కనిపించడంతో పాటు.. దీనికి సంబంధించిన పలు ప్రచారం కార్యక్రమాల్లో “ఫేస్ ఆఫ్ ది బ్రాండ్” గా వ్యవహరించనున్నారు. దక్షిణాసియా కూల్ డ్రింక్ విభాగంలో పార్లేకి మంచి పట్టుంది.
ఫ్రూటీ, యాపీ, ఫిజ్, బెయిలీ, ఫ్రీయో లాంటి బ్రాండ్స్ అన్నీ ఈ కంపెనీవే. భరత్ లో విస్తరించరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటకలో ఎక్కువమంది అభిమానులున్న అల్లు అర్జున్ ను తమ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఎంచుకుంది. బన్నీ వల్ల తమ మార్కెట్ విలువ 2022 నాటికి 10వేల కోట్లకు చేరుకుంటుందని పార్లే తెలిపింది. ప్రస్తుతం అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న నా పేరు సూర్య సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ అంచనాలున్న ఈ మూవీ ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.