ఈ మథ్య కాలంలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా)లో గొడవలు మరింతగా పెరిగాయనే చెప్పాలి. నిన్న (ఆదివారం) నాడు జీవిత రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం పెద్ద రభస అయ్యింది. సీనియర్ మా అద్యక్షుడు కృష్ణంరాజు సంఘం సభ్యుల మనోగతం తెలుసుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ముందుగా తెలిపారు. కానీ అసలు `మా` అధ్యక్షుడు నరేష్ ఉండగా.. ఆయన్ని పక్కన పెట్టి జీవిత రాజశేఖర్ సమావేశం ఏర్పాటు చేయడం పై చాలా మంది అభ్యంతరాలు తెలుపుతున్నారు. రాజశేఖర్ వర్గానికి – నరేష్ వర్గానికి మధ్య మాటల యుద్ధం సమావేశం అదుపు తప్పడంతో…కొందరు సభ్యులు సమావేశం నుండీ వాకౌట్ చేసారు.
ఇక సమావేశంలో ఇలా రచ్చ జరగడంతో `మా` కోశాధికారి పరుచూరి గోపాలకృష్ణ కన్నీళ్ళు పెట్టుకుని సమావేశం నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం అయ్యింది. నరేష్ – రాజశేఖర్ ల మధ్య వివాదాలు తలెత్తడం వలనే… ‘మా’ లో రచ్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది.`మా` కోశాధికారి పరుచూరి గోపాలకృష్ణ కంటతడి పెట్టుకుంటూ సమావేశం నుండి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా `మా` జనరల్ బాడీ సమావేశం అధ్యక్షుడి నేతృత్వంలో జరగాలి. ఐతే జనరల్ బాడీ మీటింగ్ జరపొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఫ్రెండ్లీ సమావేశం కోసమే అందరికీ సమాచారం ఇచ్చామని జీవిత అంటోంది. కొంత కాలంగా `మా` అధ్యక్షుడు నరేష్ సంఘం కార్యకలాపాలకు దూరంగా ఉండటం – ఆయన మీద అనేక ఆరోపణలు రావడం.. కలిసి ప్రచారం నిర్వహించి – ఎన్నికల తర్వాత కూడా కొంత కాలం సఖ్యతతో ఉన్న నరేష్ – రాజశేఖర్ ల మధ్య విభేదాలు తలెత్తడం.. ఈ పరిణామాలతో రోజు రోజుకూ ముదురుతున్న వివాదం.. తాజా సమావేశంతో మరింత ముదిరింది.
రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!