Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

హాలీవుడ్‌ ప్రముఖ నటుడు పాట్రిక్‌ స్టీవర్ట్‌ (86) కన్నుమూశారు. మార్వెల్‌ ఫ్రాంచైజీ ‘ఎక్స్‌ మెన్‌’లో ప్రొఫెసర్‌ చార్లెస్‌ జేవియర్‌ పాత్రలో పాట్రిక్‌ స్టీవర్ట్‌ పేరుగాంచారు. లాస్‌ ఏంజిలెస్‌లోని తన ఇంట్లో ఆరోగ్య సమస్యలతో ఇటీవల తుదిశ్వాస విడిచినట్లు ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌ సోషల్‌ మీడియాలో తెలియజేశారు. ఇంగ్లాండ్‌లోని ఒక పేద కుటుంబంలో 1940లో జన్మించిన పాట్రిక్‌ 18 సంవత్సరాల వయసులోనే నటుడిగా మారారు. డెవిడ్ లించ్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ సినిమా ‘డ్యూన్’ (1984)లో గుర్నీ హాలెక్ పాత్ర, ‘ఎక్స్‌ కాలీబర్’ (1981) సినిమాలో పాత్ర చేశారు.

Patrick Hewes Stewart

ప్రముఖ ది రాయల్‌ షేక్‌స్పియర్‌ కంపెనీలో దాదాపు 14 సంవత్సరాలు పని చేశారు పాట్రిక్‌. వివిధ నాటకాలతో తన ప్రతిభను చాటుకున్న స్టీవర్ట్‌ 1987లో ‘స్టార్‌ ట్రెక్‌: ది నెక్ట్స్‌ జనరేషన్‌’ సిరీస్‌తో కెప్టెన్‌ జీన్‌ లుకా పికార్డ్‌ అనే పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు టీవీ, రంగస్థలంలో నటుడిగా తనదైన ముద్ర వేశారు. షేక్‌స్పియర్‌ రాసిన ‘మ్యాక్‌బెత్’, ‘హామ్లెట్’, ‘ది టెంపెస్ట్’ వంటి నాటకాల్లో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి.

నటనతో పాటు, గంభీరమైన స్వరంతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో ఇతర పాత్రలకు డబ్బింగ్‌ చెప్పారు. పాట్రిక్‌ స్టీవర్ట్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన ఒక ఆల్బమ్‌కు పిల్లల ఉత్తమ స్పోకెన్‌ వార్డ్‌ ఆల్బమ్‌ విభాగంలో గ్రామీ అవార్డు కూడా వచ్చింది. యానిమేషన్ సిరీస్ ‘అమెరికన్ డాడ్’ లో డెప్యూటీ డైరెక్టర్ ఏవరీ బుల్లక్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘గ్రీన్ రూమ్’ (2015) సినిమాలో ప్రతినాయకుడిగా, ‘టెడ్’, ‘ది ఎమోజీ మూవీ’ వంటి సినిమాల్లో వాయిస్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు చేశారు.

అలాగే మూడు ఒలివియర్‌ అవార్డులు కూడా అందుకున్నారు. ఇక 2010లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2.. పాట్రిక్‌ను నైట్‌ హుడ్‌తో గౌరవించారు. నాటకరంగానికి ఆయన చేసిన విశేష సేవలకుగాను 2001లో బ్రిటన్ ప్రభుత్వం నుంచి ‘ఓబిఈ’ గౌరవం అందుకున్నారు. డిసెంబరులో విడుదల కానున్న ‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’ సినిమాలో ప్రొఫెసర్‌ ఎక్స్‌ పాత్రలో ఆయన నటించారు. జంతు సంక్షేమం ముఖ్యంగా పిట్‌బుల్ కుక్కల రక్షణ కోసం ASPCA సంస్థతో కలసి పనిచేశారు. 2023లో తన జీవిత విశేషాలతో ‘మేకింగ్ ఇట్ సో: ఎ మెమోయిర్’ పేరుతో ఆత్మకథను విడుదల చేశారు.

ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus