Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam AK 47) సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఆనవాయితీ ప్రకారం సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించారు. దాని ద్వారా పుష్ ఇవ్వాలనేది మేకర్స్ స్ట్రాటజీ. కానీ ఆడియన్స్ ఒరిజినల్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా గట్టెక్కడానికి ఎంత వరకు ఆస్కారం ఉంది? వెంకీ – త్రివిక్రమ్ కాంబో సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయా? ఇలాంటి విషయాలపై చిన్న ఫోకస్ మీ కోసం:

Aadarsha Kutumbam AK 47

ముందుగా ప్లస్ పాయింట్స్

‘ఆదర్శ కుటుంబం’ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబో అనే చెప్పాలి. వెంకటేష్ క్లాసిక్ సినిమాల్లో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి వాటికి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఆ సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. స్మాల్ స్క్రీన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ సినిమాల్లో ఒక హెల్దీ కామెడీ ఉంటుంది. వెంకటేష్ క్యారెక్టర్స్‌ని ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. అది కచ్చితంగా త్రివిక్రమ్ రైటింగ్ వల్లనే. అలాంటిది త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేస్తుంటే.. అంచనాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి కదా. అదే ‘ఆదర్శ కుటుంబం’కి మేజర్ అట్రాక్షన్ అయ్యింది.

వెంకటేష్ – త్రివిక్రమ్.. ఇద్దరికీ కూడా ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. కానీ ఈసారి ఇద్దరూ కూడా తమ కంఫర్ట్ జోన్ దాటి.. క్రైమ్ అండ్ డార్క్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశారు. ఇద్దరికీ ఇది కొత్త అటెంప్ట్. ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ని ఆకర్షించడానికి ఇది మంచి ప్రయత్నం.

కథ మంచిదే. మనం చాలా వార్తల్లో చదివాం. నార్త్‌లో చెడ్డీ గ్యాంగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్యాంగ్‌కి చెందిన వాళ్లు పలు రాష్ట్రాలకు చెందిన పెద్ద వాళ్ల ఇళ్లల్లో పనులకు చేరి.. ఆ ఇంట్లో వాళ్లని హత్య చేసి బంగారం, డబ్బు ఎత్తుకుపోతారు. సరిగ్గా ఈ లైన్‌ను తీసుకున్నారు త్రివిక్రమ్. దానిని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్‌కి సింక్ చేసిన విధానం బాగుంది. కాకపోతే ఈ సినిమాలో చెడ్డీ గ్యాంగ్‌ని చందన్ గ్యాంగ్‌గా మార్చాడు త్రివిక్రమ్.

మొదటి 15 నిమిషాలు సినిమా బాగుంది. ఆడియన్స్‌ను వెంటనే ‘ఆదర్శ కుటుంబం’ వరల్డ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు.

సత్య ఇంట్రో సీన్ కానీ, వెంకీ – రఘుబాబు మధ్య వచ్చే సన్నివేశాలు కానీ హిలేరియస్‌గా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ వాటిని ఎంజాయ్ చేస్తారు.

ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ఇలానే ఉంటుంది అని ప్రేక్షకుడు అంచనా వేసుకుంటాడు. కానీ దర్శకుడు ఇంకోలా సర్ప్రైజ్ చేశాడు. ‘బ్లాస్ట్’ పోలికలు రాకుండా తన స్టైల్‌లోకి మార్చుకుని బాగా ఎగ్జిక్యూట్ చేశాడు.

మైనస్ పాయింట్స్

మొదటి 15 నిమిషాల తర్వాత సినిమా ఫ్లాట్ గా మారుతుంది. నివేదా పేతురాజ్ ట్రాక్ అనవసరం అనే ఫీల్ ఇస్తుంది. ఆమె పార్ట్ మొత్తం తీసేస్తే.. సినిమా వేగం పెరిగేదేమో.

సెకండాఫ్‌లో సాగదీత ఉంది. పోలీస్ స్టేషన్ సీన్‌లో సత్య, రఘుబాబు కామెడీ ట్రాక్ ఓ రేంజ్‌లో వర్కౌట్ అవ్వడం వల్లనో ఏమో కానీ.. ఆ తర్వాత సన్నివేశాలు ఆ స్థాయిలో అనిపించవు.

ట్రైన్ సీక్వెన్స్‌లో ఎమోషనల్ టచ్ గట్టిగా ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కాకపోతే ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ కంగారు కంగారుగా తీసినట్టు ఉన్నారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో.. ఒక క్లారిటీ లేకుండా పిక్చరైజ్ చేశారు.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. పాటలు కూడా అవసరం లేదు. కానీ హీరో, డైరెక్టర్ ఇమేజ్ కారణంగా పెట్టాల్సి వచ్చినట్టు ఉంది.

ఓవరాల్‌గా చూసుకుంటే.. ‘ఆదర్శ కుటుంబం’ అంచనాలను పూర్తిస్థాయిలో మ్యాచ్ చేయలేదు. పైన చెప్పుకున్న లోపాలు ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఉన్నాయి. రిపీట్స్‌లో ఈ సినిమా మరింతగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి.. ఫ్యామిలీ ఆడియన్స్ కనుక ఓన్ చేసుకుంటే.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా గట్టెక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus