తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) నటించిన రీసెంట్ మూవీ ‘పట్టుదల’ (Pattudala)( తమిళంలో ‘విదాముయర్చి’). త్రిష (Trisha) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మగిల్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ షార్జా ( Arjun Sarja), రెజీనా (Regina Cassandra)..లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా చాలా స్లోగా సాగడం, హీరోకి ఎలివేషన్ సీన్స్ ఎక్కువగా లేకపోవడం వంటివి అజిత్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకోలేకపోయాయి.
మొదటి 3 రోజులు డీసెంట్ గా కలెక్ట్ చేసిన ఈ సినిమా 4వ రోజు నుండి డ్రాప్ అయ్యింది. తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.53 cr |
సీడెడ్ | 0.25 cr |
ఉత్తరాంధ్ర | 0.46 cr |
ఈస్ట్ | 1.24 cr |
‘పట్టుదల'(తెలుగు) కి రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.1.24 కోట్ల షేర్ ను రాబట్టింది . బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.2.26 కోట్ల (షేర్) దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది. ‘తండేల్’ తో పాటు సంక్రాంతి విన్నర్ అయినటువంటి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా పోటీగా ఉండటం వల్ల ‘పట్టుదల’ ని ఆడియన్స్ పట్టించుకోలేదు అని స్పష్టమవుతుంది.