Manchu Vishnu: కన్నప్పలో రజినీకాంత్ ఎందుకు లేరంటే..!

పాన్ ఇండియా అంచనాలతో భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమా ఇటీవల టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మంచు విష్ణు (Manchu Vishnu)  ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా తండ్రి మోహన్ బాబు  (Mohan Babu) గారి సారథ్యంలో, దేశవ్యాప్తంగా పేరుగాంచిన నటులతో రూపొందుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ (Akshay Kumar) , మలయాళం నుంచి మోహన్ లాల్ (Mohanlal),, తమిళం నుంచి శరత్ కుమార్ (Sarathkumar), కన్నడ నుంచి పలువురు ప్రముఖులు పాల్గొనగా… ఈ సినిమాను పాన్ ఇండియా విజన్‌తో నిర్మిస్తున్నారు.

Manchu Vishnu

అయితే తమిళ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్ (Rajinikanth) లాంటి లెజెండరీ స్టార్ ఇందులో భాగం కాకపోవడంపై అభిమానులలో చర్చ మొదలైంది. ఎందుకంటే రజినీకాంత్, మోహన్ బాబుకి ఏరా.. అనుకునే మంచి బాండింగ్ ఉంది. గతంలో ‘పెదరాయుడు’లో గెస్ట్ రోల్ చేసిన రజినీ, ఈ సినిమాకు ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నలు తలెత్తాయి. అయితే తాజాగా మంచు విష్ణు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.

‘‘నాన్నగారు అడిగితే రజినీ అంకుల్ తప్పకుండా చేస్తారు. కానీ ఈ కథలో ఆయన స్థాయికి తగిన పాత్ర లేదు. ఏదో ఒక చిన్న క్యామియో ఇవ్వడం నాన్నకు ఇష్టం లేదు. ఆయన రేంజ్‌కు సరిపోయే పాత్ర వస్తే తప్ప వాడుకునే ఉద్దేశం లేదు’’ అంటూ విష్ణు అన్నారు. ఇది విన్న తర్వాత అభిమానులు కూడా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. ఒక పెద్ద స్థాయిలో నిర్మితమవుతున్న సినిమాకు రజినీ క్యామియో అంత తేలికగా ఉండకూడదన్న మంచు ఫ్యామిలీ ఆలోచనను స్వాగతిస్తున్నారు.

ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) లాంటి స్టార్ రీమ్యునరేషన్ లేకుండా కేవలం అనుబంధంతో ‘కన్నప్ప’లో నటిస్తుండటం సినిమా రేంజ్‌ను సూచిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి టీజర్, పాటలు ఇప్పటికే మంచి స్పందన అందుకున్నాయి. శివ శివ పాటకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక సినిమా ఏప్రిల్ 25న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ VFX పనుల వల్ల వాయిదా పడింది.

కొత్త పాయింట్లు లాగుతున్న సునీల్‌.. ‘హత్య’ డబ్బులు వారివేనంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus