విజయ్‌ సేతుపతితో సినిమా… టైటిల్‌ ఇదేనా? ఇలాంటి పేరుతో..

విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) – పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)  కాంబినేషన్‌లో ఓ సినిమా ఇటీవల అనౌన్స్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వస్తుందని ఓ వారం నుండి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. దీంతో ఈ కాంబినేషన్‌ సాధ్యమేనా? వరుస డిజాస్టర్లు ఉన్న దర్శకుడికి విజయ్‌ సేతుపతి ఓకే చెబుతారా? అంటూ ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే వారి ప్రశ్నలను, అనుమానాలను పటాపంచలు చేస్తూ పూరి జగన్నాథ్‌ – ఛార్మి (Charmy Kaur) కలసి కొత్త సినిమాను అనౌన్స్‌ చేసేశారు.

Vijay Sethupathi, Puri jagannadh:

దీంతో మక్కల్‌ సెల్వన్‌ కొత్త సినిమా ఫిక్స్‌ అయిపోయింది. అయితే ఈ కాంబినేషన్‌, ప్రాజెక్ట్‌ విషయంలో నెటిజన్లు నెగిటివ్‌గా మాట్లాడటం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికీ ఓ కారణం ఉంది. పూరి జగన్నాథ్‌ నుండి రీసెంట్‌గా వచ్చిన ‘లైగర్‌’ (Liger) , ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకున్నారు. దీంతో అలాంటి దర్శకుడు ఎందుకు అనేది విజయ్‌ సేతుపతి ఫ్యాన్స్ ఉద్దేశం. అయితే ఇలాంటి పరిస్థితుల నుండి ఉవ్వెత్తున ఎగరడం పూరికి అలవాటు.

గతంలో చేసి చూపించారు కూడా. ఇక ఈ సినిమాకి ‘బెగ్గర్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఓ స్టార్‌ హీరో సినిమాకి ఇలాంటి పేరు పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే పూరి జగన్నాథ్‌ గత చిత్రాల టైటిల్స్‌ చూస్తే.. ఆయన ఇప్పుడు ఇలాంటి పేరు పెట్టడం పెద్ద విషయం కాదు. ఇక పూరి గురించి ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు శంతను భాగ్యరాజ్‌ రియాక్ట్‌ అయ్యారు. పూరి జగన్నాథ్‌ అవుట్‌డేటెడ్‌ అయ్యారని..

‘మహారాజ’  (Maharaja) లాంటి హిట్ సినిమా తర్వాత విజయ్‌ సేతుపతి పూరి దర్శకత్వంలో నటించడానికి ఎందుకు అంగీకరించారు అంటూ ఆ నెటిజన్‌ అడిగారు. దానికి శంతను.. ఇండస్ట్రీలో వ్యక్తుల గురించి అలా మాట్లాడకండి. సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టేటప్పుడు సరైన పదాలు వాడండి. ఆయన ప్రముఖ దర్శకుడు. గౌరవం ఇవ్వండి అని సుతిమెత్తగానే సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ నెటిజన్‌ క్షమాపణలు చెప్పి పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు.

రిలీజ్ అయిన సినిమాకి మళ్ళీ సెన్సార్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus