Pattudala Trailer: అజిత్ నుండి మరో యాక్షన్ ఫీస్ట్ గ్యారంటీనా?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, దర్శకుడు మగిజ్ తిరుమేని కాంబినేషన్లో ‘విదాముయార్చి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘బ్రేక్ డౌన్’ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగులో ఈ సినిమా ‘పట్టుదల’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ కూడా బయటకు వచ్చింది.

Pattudala Trailer

‘పట్టుదల’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 21 సెకన్ల నిడివి కలిగి ఉంది. హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం..తర్వాత పెళ్లి చేసుకోవడం.. అటు తర్వాత వాళ్ళ మధ్య మనస్పర్థలు రావడం వంటివి ట్రైలర్లో చూపించారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే సమయంలో హీరోయిన్ మిస్ అవ్వడంతో.. హీరో ఆమె కోసం గాలించడం మొదలుపెడతాడు. అతను నివసిస్తున్న దేశంలో క్రైమ్స్ అనేవి జరగవు అంటూ.. పోలీసులు చెప్పడం, అయినా తగ్గకుండా ఆమె కోసం వెతుకుతున్న టైంలో.. దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు అతను తెలుసుకుంటాడు? ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది.

అజిత్ లుక్స్ బాగున్నాయి. త్రిష గ్లామర్ గా కనిపించింది. అర్జున్, రెజీనా.. కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అదిరిపోతోంది అని విజువల్స్ చెబుతున్నాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ‘పట్టుదల’ ట్రైలర్ కి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus