Veda Agrawal: డాకు మహరాజ్.. ఆ చిన్నారి పాప ఎవరో తెలుసా?

సంక్రాంతి బరిలో దూసుకొచ్చిన గేమ్ ఛేంజర్ పెద్దగా పాజిటివ్ టాక్ అందుకోలేదు. ఇక నెక్స్ట్ వచ్చిన డాకు మహరాజ్ సినిమా మాత్రం సంక్రాంతిలో మాస్ వైబ్ ని క్రియేట్ చేస్తోంది. బాలయ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, అభిమానులకు, ప్రేక్షకులకు మంచి కిక్కిస్తున్నాడు. బాలకృష్ణ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, కుటుంబం మొత్తం థియేటర్‌కు వెళ్లేలా చేసింది. సినిమాలో బాలయ్య నటనతో పాటు ఓ చిన్నారి నటన కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

Veda Agrawal

ఆ చిన్నారి పాత్ర సినిమాకు చక్కటి ఫీల్ ఇచ్చిందని చాలా మంది ప్రశంసించారు. ఇక చిన్నారి గురించి నెటిజన్లు ఇంటర్నెట్ లో వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఆ పాప పేరు వేదా అగర్వాల్. వేదా అగర్వాల్ నటన సినిమాకు కీలకమైన బలంగా మారింది. హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాల్లో వేదా తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. షూటింగ్ సమయంలో బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని కళ్లముందు చూపిస్తూ, సినిమాలో తన పాత్రకు జీవం పోసింది.

వేదా తన నటనతో సినిమాలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య దగ్గరికి వెళ్లి ఆ పాప కంటతడి పెట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వేదా కుటుంబం కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. వేదా తండ్రి మాధవ్ అగర్వాల్, సింగర్ మరియు మ్యూజిక్ కంపోజర్. ఆయన గజల్, భజన్, తుమ్రిలలో దిట్ట. IIMA అవార్డుల్లో బెస్ట్ మేల్ సింగర్‌గా నామినేట్ అయ్యారు. వేదా తల్లి మేఘ గృహిణి.

చిన్న వయసులోనే నటనలో తన ప్రతిభను ప్రదర్శించిన వేదా, ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు సాధించనుందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం డాకు మహరాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవిహారం చేస్తోంది. బాలయ్య పాత్రకు, సినిమాలోని ఇతర సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ విజయం తర్వాత వేదా అగర్వాల్ పేరు కూడా టాలీవుడ్ లో మరింత ట్రెండింగ్ అవ్వనున్నట్లు అర్ధమవుతుంది.

 ‘డాకు మహారాజ్’..2 వ రోజు కూడా కుమ్మేసింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus