పవర్ స్టార్, దాసరి కాంబినేషన్ సినిమా టైటిల్ ఫిక్స్

  • September 14, 2016 / 01:59 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాలు చేయనున్నారు. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ‘కాటమరాయుడు” చిత్రీకరణ జోరుగా సాగుతోంది. ఇందులో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ అయిపోయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి పని చేయనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆ తర్వాత పవర్ స్టార్, దాసరి నారాయణరావు సొంత బ్యానర్ అయిన తారకప్రభు ఫిలిమ్స్ లో మూవీ చేయనున్నారు. దర్శకుడు ఇంకా ఖరారు కానీ ఈ ఫిల్మ్ కి టైటిల్ ని ఫిక్స్ చేశారు.

తాజాగా ఈ బ్యానర్ పై ‘బోస్’ అనే టైటిల్ రిజిస్టర్ చేసారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ అనేది ట్యాగ్ లైన్. టైటిల్, ట్యాగ్ లైన్ చూస్తుంటే పవర్ ఫుల్ యాక్షన్ చిత్రంగా అనిపిస్తోంది. ముఠామేస్త్రి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పేరు బోస్, అదే పేరుని పవన్ కి పెట్టడంతో మెగా అభిమానులు సంబర పడిపోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus