జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో అబవ్ యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ సెకండాఫ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మూవీ సెకండాఫ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రిజల్ట్ బెటర్ గా ఉండేది. అయితే పవన్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీలపై ఘాటుగా విమర్శలు చేయడంతో పాటు జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలలో కచ్చితంగా విజయం సాధించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు పడుతున్నాయి. తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీదే గెలుపంటూ పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. 2024లో ఈ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురుతుందని ఆయన వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో సీటు మనదేనని అదే సమయంలో గెలుపు కూడా మనదేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇక్కడినుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తాడని అతనిని గెలిపించడం ఎంతో అవసరమని పవన్ చెప్పుకొచ్చారు. పవన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. పవన్ త్వరలో ఓజీ మూవీ షూటింగ్ తో బిజీ కానున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ (Pawan Kalyan) సుజీత్ కాంబో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. పవన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పవన్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా పవన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?