జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతరులకు తన వంతు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన చిన్నారి రేవతి కొన్నిరోజుల క్రితం మృతి చెందగా రేవతి మరణ వార్త తెలిసిన పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అరుదైన వ్యాధితో జన్మించిన రేవతి ఆ వ్యాధి వల్ల మృతి చెందారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ రేవతి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.
నాలుగు సంవత్సరాల క్రితం రేవతి అనే చిన్నారి తనను కలిసిందని అరుదైన వ్యాధితో జన్మించిన ఆ చిన్నారి అనారోగ్యంతో బాధ పడుతూ కూడా చదువును కొనసాగించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మ్యూజిక్ నేర్చుకుంటూ ఆ చిన్నారి చూపిన ధైర్యం నన్ను అబ్బురపరిచిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ చిన్నారి ఏకంగా 750 శ్లోకాలను కంఠస్తం చేసిందని తెలిసి ఆశ్చర్యపోయానని ఆయన చెప్పుకొచ్చారు.
అరుదైన వ్యాధి వల్ల మూడు రోజుల క్రితం రేవతి శివైక్యం చెందారని ఈ విషయం నా మనస్సును ఎంతగానో కలచివేసిందని ఆయన కామెంట్లు చేశారు. చిన్నారి అత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాతో పవన్ హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా రిలీజ్ డేట్ల విషయంలో కన్యూజన్ నెలకొంది. పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కడం గమనార్హం. పవన్ తో సినిమాలను తెరకెక్కించాలని క్యూ కడుతున్న దర్శకుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఎంతోమంది టాప్ డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ ను ఎంతగానో అభిమానిస్తున్నారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?