‘పవర్ స్టార్’ ఫ్యాన్స్ పై మెగా బ్రదర్ సీరియస్!!!

మళ్లీ కధ మొదటికీ వచ్చిందా?? సర్దార్ గబ్దర్ సింగ్ ఆడియో వేడుకకు ముందు అటు చిరు, ఇటు పవన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. అయితే ఆ తరువాత ఏమయిందో ఏమో కానీ, ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రేమ పుట్టుకొచ్చింది. చిరు సర్దార్ ఆడియోకి చీఫ్ గెస్ట్ గా సైతం వచ్చాడు. అదంతా పక్కన పడితే, మరో పక్క రగులుతున్న వ్యవహారం ‘పవర్ స్టార్’ఫ్యాన్స్ హంగామా. సహజంగా మెగా ఇవెంట్స్ లో ఎక్కడకు వెళ్ళినా పవర్ స్టార్ అభిమానులు సైతం వచ్చి అక్కడ పవర్ స్టార్ ను హైలైట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అదే క్రమంలో ఈ విషయంపై అటు నాగ బాబు, స్టైలిష్ స్టార్ బన్నీ ఫాన్స్ కు చాలా సార్లు బహిరంగమగానే వార్నింగ్స్ సైతం ఇచ్చారు. ఇక బన్నీ విషయం అయితే చెప్పుకొనవసరంలేదు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో నాగ బాబు మరొకసారి పవన్ ఫ్యాన్స్ పై ఫయిర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి…విషాయంలోకి వెళితే…చిరంజీవి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ జై పవన్ అనే నినాదాలు ఇవ్వడంతో వారిపై విరుచుకు పడ్డారు నాగబాబు…ఆయన కోపంతో వారిని తిడుతూనే భాద్యతగా ఉండమని, మీ సొంత డబ్బులు ఖర్చు చేసి ఇంత హడావుడి ఎందుకు చేస్తారు..! ఆ డబ్బు ఎన్ని కష్టాలు పడితే వస్తుంది..అలాంటపుడు అభిమానంతో ఇలా ఖర్చు చేస్తే మీ తల్లిదండ్రుల దగ్గర మా పరువు పోతోందని ఇకపై అలా చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. అలా మొత్తానికి మెగా బ్రదర్ ఫ్యాన్స్ కు తన ప్రతాపం చూపించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus