Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ‘భవదీయుడు’ లెక్క తేల్చాల్సిందే అంటున్నారా?

Pawan Kalyan: ‘భవదీయుడు’ లెక్క తేల్చాల్సిందే అంటున్నారా?

  • August 15, 2022 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘భవదీయుడు’ లెక్క తేల్చాల్సిందే అంటున్నారా?

హీరోకు అడ్వాన్స్‌ ఇవ్వడంలో ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో.. ఒకవేళ తేడా కొట్టి ఆ అడ్వాన్స్‌ను వెనక్కి తీసుకోవాలి అనుకుంటే అంతే ఫాస్ట్‌గా ఉంటుంది మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ నిర్మాణ సంస్థ నుండి టాలీవుడ్‌లో అడ్వాన్స్‌ తీసుకోని హీరోలు, టెక్నీషియన్లు తక్కువమంది ఉంటారు. అలా పవన్‌ కల్యాణ్‌కి కూడా నిర్మాణ సంస్థ కొన్నేళ్ల క్రితం భారీ మొత్తం అడ్వాన్స్‌ ఇచ్చేసింది. ఆ మధ్య సినిమా అనౌన్స్‌ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ అడ్వాన్స్‌ వెనక్కి అడుగుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ అనే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ అనౌన్స్‌ చేసింది. కొన్ని నెలల క్రితం సినిమా ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత పవన్‌ – హరీశ్‌ కొన్నిసార్లు కలసి సినిమా గురించి చర్చించి ఓకే చేసుకున్నారు. నిర్మాతలు కూడా పవన్‌ను పలుమార్లు కలసి త్వరలో సినిమా మొదలు అని అనుకున్నారు, అదే విషయం ప్రేక్షకులకు చెప్పారు కూడా. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ముందుకెళ్లడం కష్టం అనే మాట వినిపిస్తోంది.

పవన్‌ కల్యాణ్‌ బిజీ షెడ్యూల్‌, పొలిటికల్‌ కెరీర్‌, ఆరోగ్య సమస్యలు.. తదితర కారణాల వల్ల ముందుగా అనుకున్న సినిమాలను చేసే పరిస్థితి లేదు అంటున్నారు. ఇందులో భాగంగా ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ను పక్కన పెట్టేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో మాట బయటికొచ్చింది. సినిమా కోసం పవన్‌ తీసుకున్నారు అంటున్న రూ. 40 కోట్లు – రూ.50 కోట్ల అడ్వాన్స్‌ వెనక్కి ఇచ్చేయాల్సి ఉంది అంటున్నారు.

ఇప్పటికే అడ్వాన్స్‌ ఇచ్చి చాలా రోజులు వెయిట్‌ చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌.. ఇప్పుడు వెనక్కి తీసుకునే పనిలో పడిందట. గతంలో త్రివిక్రమ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఓ సినిమా కోసం త్రివిక్రమ్‌కు అడ్వాన్స్‌ ఇచ్చిన మైత్రీ టీమ్‌.. ఆ సినిమా సంగతి ఎంతకీ తేలకపోవడంతో వడ్డీతో సహా త్రివిక్రమ్‌ నుండి అడ్వాన్స్‌ తీసుకున్నారని టాక్‌. ఇప్పుడు పవన్‌ విషయంలోనూ అదే జరుగుతుంది అని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #harish shankar
  • #Mythri Movie Makers

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

13 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

13 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

17 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

18 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version