పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?

ఈ ఉగాదికి మహేష్ బాబు- త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్, ప్రభాస్ – మారుతి సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తుందేమో అనుకుంటే.. అలాంటిదేమి జరగలేదు. దీంతో అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. అయితే పవన్ అభిమానులకు మాత్రం చిత్ర బృందం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నిజానికి ‘వినోదయ సీతమ్’ చిత్రం తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. కానీ తెలుగు నేటివిటీకి తగినట్టు చాలా మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్.ఒరిజినల్ ను తెరకెక్కించిన సముద్ర ఖని ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రం జూలై 28 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ మూవీ ‘టైం'(సమయం) కి రూపమంటూ ఉంటే ఎలా ఉంటుందో.. అలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు. ఒరిజినల్ లో ఈ పాత్రను దర్శకుడు సముద్రఖని పోషించారు. ఇక్కడ పవన్ ను పెట్టడం వల్ల.. ఆ పాత్ర లెంగ్త్ ఇంకా పెంచారు. క్లైమాక్స్ కూడా మార్చేశారు అని సమాచారం. శ్రీలీల ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు కూడా టాక్ నడుస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus