Pawan Kalyan: ‘వీరమల్లు’ కోసం క్రిష్‌ బ్లాక్‌బస్టర్‌ ఫైట్‌!

Advertisement

సినిమాకు మంచి హైప్‌ ఇవ్వడానికి, చూస్తున్నప్పుడు అదిరిపోయే కిక్‌ ఇవ్వడానికి దర్శకులు ప్లాన్స్‌ వేస్తూనే ఉంటారు. అలా పుట్టుకొచ్చేవే భారీ యాక్షన్‌ సీన్స్‌. గతంలో చాలా సినిమాల్లో ఇలాంటి సీన్స్‌ చూసే ఉంటారు. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ సినిమాలో కూడా అలాంటి ఓ సీన్‌ను సిద్ధం చేశారు ప్రముఖ దర్శకుడు క్రిష్‌. పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల రీస్టార్ట్‌ అయ్యింది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మొదలవ్వడంతో ఫ్యాన్స్‌కి ఊపు ఇవ్వడానికి ఓ మేకింగ్‌ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు.

‘హరి హర వీరమల్లు’ మేకింగ్‌ వీడియో చూస్తే అందులో పవన్‌.. ప్రత్యేకమైన శూలంతో పోరాట సన్నివేశాల ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాక్టీస్‌ పూర్తి చేసి షూటింగ్‌ మొదలుపెట్టేశారు. ఈ షెడ్యూల్‌లో పవన్‌ ఈ పోరాట సన్నివేశాల్లోనే పాల్గొంటారట. ఈ క్రమంలో సుమారు వెయ్యి మందితో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేశారట దర్శకుడు క్రిష్‌. ప్రస్తుతం ఆ సీన్సే చిత్రీకరిస్తున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి హైలట్‌గా నిలుస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

‘హరి హర వీరమల్లు’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ సరసన నిధి అగర్వాల్‌ నటిస్తోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తున్నారు. ఎ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇక ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమాకు పని చేసిన టోడోర్‌ లోజోవ్‌ ఈ సినిమాకు యాక్షన్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పవన్‌ ఈ సినిమా కోసం సుమారు నెల రోజుల కాల్‌షీట్లు ఇచ్చారని టాక్‌.

ఆ తర్వాత ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తారట. ఇప్పటికే వివిధ కారణాల వల్ల ఈ సినిమాల చిత్రీకరణలు ఆలస్యమవుతూ వచ్చాయి. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ పవన్‌ కల్యాణ్‌ను కలసిన విషయం తెలిసిందే. దాంతో ఆ సినిమాపై క్లారిటీ వచ్చింది. ఆ సినిమా తర్వాతే మిగిలిన సినిమాలపై క్లారిటీ వస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus