‘వకీల్ సాబ్’ విషయంలో జాగ్రత్త పడుతున్న పవన్..!

  • October 16, 2020 / 05:32 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 80శాతం పూర్తయ్యింది. సుమారు రెండున్నరేళ్ళ తర్వాత పవన్ నుండీ రాబోతున్న చిత్రం కావడంతో ‘వకీల్ సాబ్’ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. నిజానికి మే 15నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడడంతో విడుదల కాలేదు.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలాఖరుకి పూర్తవుతుందట. అక్టోబర్ నెలాఖరు నుండీ పవన్ ఈ చిత్రం షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ .. ఈ చిత్రం నిర్మాత అయిన దిల్ రాజుకి కొన్ని సలహాలు.. సూచనలు ఇచ్చారని తెలుస్తుంది. ‘వకీల్ సాబ్’ చిత్రం ప్రమోషన్స్ ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని పవన్.. దిల్ రాజుని కోరారట. ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్స్ ను విడుదల చేస్తే హైప్ పెరుగుతుందని కూడా సూచించారట.అంతేకాదు ఫ్యాన్స్ ను కూడా కంట్రోల్ చేసినట్టు ఉంటుందని కూడా ఆయన చెప్పారట.

2021 సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ ను రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు భావిస్తున్న తరుణంలో పవన్ ఇలా చెప్పినట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా.. దసరా లేదా దీపావళికి ‘వకీల్ సాబ్’ టీజర్ విడుదలయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని వినికిడి. తమన్ బి.జి.ఎం పనుల్లో బిజీగా ఉన్నాడట.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus