పవన్ కల్యాణ్ – సుజీత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లుగతా జరిగే త్వరలో షూటింగ్ కూడా మొదలవుతుంది అంటున్నారు. ఆ సంగతి, ముచ్చట్లు తర్వాత పెడదాం. ఎందుకంటే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికొచ్చింది. దాని ప్రకారం చూస్తే ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా మరో నాలుగు భాషల్లో రూపొందబోతోంది. అఁ.. అవును మీరు అనుకుంటున్నదే. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.
డీవీవీ దాన్య నిర్మాణంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందబోయే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ రిజిస్టర్ చేశారు అనేది లేటెస్ట్ టాక్. ఐదు భాషల్లో ఈ టైటిల్ రిజిస్టర్ అయ్యింది అని చెబుతున్నారు. అయితే ఐదు వేర్వేరు టైటిల్స్ కాకుండా.. ఎక్కడైనా అర్థమయ్యేలా, బజ్ ఉండేలా కామన్ టైటిల్‌ను ఎంచుకుని ఓకే చేశారు అని చెబుతున్నారు. సినిమా ఓపెనింగ్ రోజే ఆ టైటిల్‌ను అనౌన్స్ చేస్తారు అని కూడా అంటున్నారు. ‘ఓజి.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, రిజిస్టర్ చేసేశారట.
హీరో అభిమాని.. ఆ హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో మొన్నీమధ్య సంక్రాంతికి టాలీవుడ్లో చూశాం. బాబీ కొల్లి, గోపీచంద్ మలినేని అలా వచ్చిన మంచి విజయాలు అందించారు. ఇప్పుడు సుజీత్.. పవన్ కల్యాణ్‌కు ఎంత అభిమాని అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ లెక్కన అతని నుండి ఎలాంటి సినిమా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మేరకు టీమ్ కథను ఓవైపు పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తుండగా, ఆయన ముంబయిలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి షూటింగ్ స్పాట్స్ ఫైనల్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం పవన్ (Pawan Kalyan) హైదరాబాద్ దాటి వెళ్లబోతున్నారు. అదేంటి ఎప్పుడూ వెళ్లలేదా అని అంటారా? గత కొన్నేళ్లుగా పవన్ తన సినిమాల షూటింగ్‌లు అన్నీ హైదరాబాద్‌లోనే చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం ముంబయి వెళ్తారు అని సమాచారం.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?