ఎన్నికల ముందే సీఎం అయిన పవన్ కళ్యాణ్

  • February 17, 2017 / 07:26 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ని చూడాలనేది ఆయన అభిమానుల కల. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పవర్ స్టార్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో తమ కల నిజమవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగానే జనసేనానిని ముఖ్యమంత్రి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ వచ్చే నెల 24 న రిలీజ్ కానుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ ప్రాజక్ట్ మొదలుకానుంది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ ఈ కథని రాసినట్లు తెలిసింది.

పవన్ పొలిటికల్ కెరీర్ కి ఉపయోగ పడే విధంగా ఇందులో డైలాగులు ఉంటాయని, అంతేకాకుండా సీన్లు కూడా ప్రేక్షకులను ఆలోచింపజేసేదిగా ఉంటుందని సమాచారం. తాజాగా క్లైమాక్స్ లో పవన్ ని ముఖ్యమంత్రి చేసే విధంగా స్క్రిప్ట్ కంప్లీట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అయితే అభిమానులు సంవత్సరం ముందే వెండితెరపై పవన్ ని సీఎం గా చూడబోతున్నారన్నమాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus