‘అంకితం’ అంటే…..’చివరిది’ అనేనా??

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడా? అత్తారింటికి దారెది సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన  పవన్, ఇప్పుడు సర్దార్ తో మరో ప్రభంజనం సృష్టిస్తాడు అని అభిమానులు అందరూ ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా కాలం నుంచి పవన్ సర్దార్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఇప్పటికే క్లైమ్యాక్స్ పార్టు షూటింగులో ఉన్న సర్దార్.. త్వరలోనే విడుదల కానుంది. ఏప్రియల్ 8న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయిపోతుందని మొన్ననే నిర్మాత శరత్ మరార్ కన్ఫామ్ చేశాడు కూడా. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు కధ ఇక్కడే మొదలయింది. విషయం ఏంటంటే….పవన్ కల్యాణ్ ఈ చిత్రం విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తుంది అదేమిటి అంటే….

ఈ సినిమా మొదట్లో.. పవన్ ఒక పర్సనలైజ్డ్ కార్డు వేస్తున్నాడట. అది కూడా అభిమానుల కోసమే అంటున్నాడు…ఇంతకీ ఆ పర్సనలైజ్డ్ కార్డు ఏంటంటే…”మూడేళ్ల నుండి నా సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ చిత్రం అంకితం” అంటూ సినిమాను మొదలుపెడతారట. వినడానికి పవన్ తన అభిమానులపై అభిమానం చూపిస్తున్నా..ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అన్న వాదన సైతం టాలీవుడ్ లో వినిపిస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలా భారీ గ్యాపులు చాలాసార్లు వచ్చాయి, ఒకానొక సమయంలో అయితే పవన్ ఇక సినిమాలు చెయ్యడు అన్న వాదన సైతం వినిపించింది.

అప్పుడెప్పుడూ లేని కొత్త పద్దతి ఇప్పుడు ఎందుకో మరి, కొంపతీసి అలా అంకితం ఇచ్చేసి ఇదే లాస్టు సినిమా అంటాడా ఏంటి అని సైతం అభిమానులు భయపడుతున్నారు. కాకపోతే తాజాగా పవన్ ఇచ్చిన ఇంటర్యూలో చెప్పకనే చెప్పాడు….తాను మనుగడ కొనసాగించాలంటే ఇంకొన్ని సినిమాలు చేయక తప్పదని. అంటే ఇంకొంత కాలం అభిమానులు హ్యాపీ అన్న మాట. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus