అమీర్ ఖాన్ తరహాలో రియాలిటీ షో హోస్ట్ చేయనున్న పవన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే బుల్లెతెర బాటలో నడవనున్నట్లు తెలుస్తుంది. హిందీలో అమీర్ ఖాన్ హోస్ట్ గా పాపులర్ అయిన “సత్యమేవ జయతే” షో ప్రేరణతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ బుల్లితెర షో చేసేందుకు రెడీ అవుతున్నారని పవన్ అభిమానుల ద్వారా తెలుస్తుంది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రజా సమస్యలను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ ప్రోగ్రాం ఉంటుందని పవన్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ మొత్తం యాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు.

యాత్రల ద్వారా మొత్తం ప్రజలను కలుసుకునే వీలు లేకపోవడంతో ఈ షోను ఉపయోగించుకొని ముందుకు వెళ్లాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలిసింది. ప్రజల్లో చైతన్యం రేకెత్తిస్తూనే తన రాజకీయ జీవితానికి అనుకూలంగా ఈ షోను మలిచేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కు ఈటీవీ సంస్థల ఎండీ రామోజీరావుతో ఉన్న అనుబంధం కారణంగా.. ఈ షోను ఈటీవీ వారు నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో తమ అభిమాన నటుడుని వెండితెరపై చూసుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్న అభిమానులు బుల్లితెరపై చూసుకొని మురిసిపోదామని అనుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus