Badri Movie: 21 ఏళ్ళ ‘బద్రి’ గురించి మనకు తెలియని విషయాలు..!

పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన చిత్రం ‘బద్రి’. 2000 వ సంవత్సరంలో ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదల అయ్యింది. అంటే ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 21ఏళ్ళు కావస్తోందన్న మాట. ‘విజయలక్ష్మీ మూవీస్’ పతాకం పై టి.త్రివిక్రమ్ రావు గారు ఈ చిత్రాన్ని నిర్మించగా పూరి జగన్నాథ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అప్పట్లో ఈ చిత్రం పెద్ద హిట్. అలాగే అప్పటి వరకూ ఉన్న మాస్ ఫార్ములాకి స్వస్తి చెప్పి.. సరికొత్త హీరోయిజాన్ని పరిచయం చేసాడు పూరి. ‘నువ్వు నంద అయితే.. నేను బద్రి బద్రీనాథ్’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిందనే చెప్పాలి.

ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లో కూడా ప్రకాష్ రాజ్.. నంద అనే పాత్రలో కనిపించే సరికి ప్రేక్షకులు మళ్ళీ ‘బద్రి’ నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. అంతలా ‘బద్రి’ ఇంపాక్ట్ పవన్ ఫ్యాన్స్ పై పడింది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘బద్రి’ సినిమాకి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదు. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ వద్దకు ఈ కథ వెళ్ళింది. ‘బద్రి’ ని రిజెక్ట్ చేసింది మరెవరో కాదు మన అక్కినేని నాగార్జున గారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మొదట ఈ కథని నాగార్జున గారికే చెప్పారు. నిజానికి కొత్త దర్శకులను ఎంకరేజ్ చెయ్యడంలో నాగార్జున గారు ముందుంటారు. కానీ ఎందుకో ఈ హిట్ సినిమాని ఆయన మిస్ చేసుకున్నారు. ఇక నాగార్జున రిజెక్ట్ చెయ్యడంతో ఈ కథను పవన్ వద్దకు తీసుకెళ్ళాడు పూరి.

కానీ పవన్ కళ్యాణ్.. ‘ క్లైమాక్స్ మార్చి తీసుకురమ్మని కండిషన్ పెట్టాడట’. దానికి పూరి.. ‘బహుశా పవన్ కళ్యాణ్ కథ చెబుతున్నప్పుడు నిద్రపోయి ఉంటాడు’.. అని భావించి, ఆ తరువాతి రోజు వెళ్లి మళ్ళీ అదే క్లైమాక్స్ ను వినిపించాడట. అయితే పవన్.. ‘నిన్న చెప్పిన క్లైమాక్స్ కూడా ఇదే కథా’.. అని పూరిని అడిగారట. దీంతో ఏదైతే అదైందని భావించి.. ‘క్లైమాక్స్ మార్చడం ఇష్టం లేదు.. మీరు సరిగ్గా వినలేదేమో అని భావించి మళ్ళీ ఇంకోసారి వినిపిద్దాం అని వచ్చాను’ అని చెప్పాడట. దానికి పవన్ .. ‘నువ్వు క్లైమాక్స్ మార్చి ఉండి ఉంటే.. ఈ కథ చెయ్యకూడదు అని అనుకున్నాను. నీ కాన్ఫిడెన్స్ నచ్చింది’ అని చెప్పి ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus