Pawan Kalyan hoodie Cost: పవన్ ధరించిన హుడీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఇప్పటికే మొదటి సీజన్ మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో రెండవ సీజన్ కూడా ప్రారంభించారు. అయితే ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. రెండవ సీజన్ లో భాగంగా ఈ కార్యక్రమానికి సినీ సెలెబ్రిటీలను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం మరింత ఆదరణ సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.ఇక ఈ ఎపిసోడ్ పై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ఎలాంటి ప్రశ్నలు వేస్తారు పవన్ సమాధానాలు ఏంటి అనే విషయం గురించి ఆసక్తి నెలకొంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ బ్లాక్ హుడి ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

దీంతో పవన్ కళ్యాణ్ ధరించిన ఈ బ్లాక్ హుడి ధర ఎంత ఉంటుంది అని పెద్ద ఎత్తున నేటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ధరించిన ఈ హుడి హ్యూగో బాస్ కంపెనీకి చెందింది. దీని ధర విదేశాల్లో అయితే 245 డాలర్లుగా ఉంది. ఇది మన భారతీయ మార్కెట్ లో రూ.20 వేల నుంచి రూ.27 వేల వరకు ఉంటుందని తెలియడంతో నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus