పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అసలు సినిమాల్లో నటిస్తారా లేదా అని అనుకుంటున్న సమయంలో మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీ అవడం విశేషం. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవన్ మరోవైపు సినిమా షూటింగ్ లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక పవన్ పరిస్థితులను అర్థం చేసుకుని కూడా దర్శక నిర్మాతలు ఆయనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు.
ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పవన్ కళ్యాణ్ సినిమాలు లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత పవన్కళ్యాణ్ జిమ్.లో వర్కౌట్స్ మొదలుపెట్టినట్లు సమాచారం. ఫిట్నెస్ విషయంలో పెద్దగా బాడీ పెంచకుండా నార్మల్ లుక్ తోనే ఎంతగానో ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత వ్యాయామం విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అజ్ఞాతవాసి టైంలో ఆయన కాస్త బొద్దుగా మారినట్లు కూడా అనిపించింది. ఇక మళ్లీ లాక్ డౌన్ లో కాస్త వ్యాయామాలు చేసి బరువు తగ్గారు.
అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కోసం కొంత ఫిట్నెస్తో కనిపించాలని దర్శకుడు క్రిష్ చెప్పడంతో పవన్ జిమ్ లో హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ లుక్ కు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూస్తూ ఉంటే హరిహర వీరమల్లు సినిమాలో సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో పవన్ నటించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఆ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అసలైతే ఈ మూవీని ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న దర్శకుడు సినిమాను దసరా సమయానికి విడుదలకు సిద్ధం చేయాలి అని ఆలోచిస్తున్నారు.
1
2
3
4
5
6
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!