పవన్ కల్యాణ్ ఇప్పుడు జనసేనాని అయ్యారు. జనసేన అనే పార్టీ పెట్టుకుని.. ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు.. పోరాడుతున్నారు. అయితే అసలు పవన్ యాక్టివ్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడు, పార్టీ ఎందుకు పెట్టాడు అనే ప్రశ్న చాలా రోజుల నుండి వస్తోంది. అయితే తాజాగా మరో ప్రశ్న యాడ్ చేశాడు బాలకృష్ణ. ‘అన్‌స్టాపబుల్ 2’ షోకి ఫైనల్స్ అతిథిగా పవన్ వచ్చాడు. ఈ క్రమంలో రాజకీయ ప్రశ్నలు కూడా ఈ షోలో వచ్చాయి.
అందులో ఒకటి ‘టీడీపీలో ఎందుకు చేరలేదు’ అని. దీనికి పవన్ సమాధానమిచ్చాడు. పవన్ రాజకీయాల్లోకి రావడానికి.. నల్గొండ జిల్లాకు సంబంధం ఉంది. ఒకప్పుడు అక్కడ ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉండేది. ఆ రోజుల్లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, రక్షిత మంచి నీటిని అందించాలని పవన్ అనుకున్నాడు. దీని కోసం కొంతమందిని ఆ ప్రాంతానికి పంపిస్తే అక్కడి రాజకీయ గ్రూప్స్ అడ్డుకున్నాయట. దీంతో మంచి పని చేయడానికి కూడా అడ్డంకులు ఉంటాయా అనిపించిందట పవన్‌కు.
ఎన్జీవో ప్రారంభించాలని తొలుత అనుకున్నా… ఆ తర్వాత తన ఆలోచనలకు ఎన్జీవో కంటే పార్టీ అయితే బెటర్ అనిపించిందట. అందుకే రాజకీయ పార్టీ పెట్టాను అని పవన్ చెప్పాడు. అదే సమయంలో ఓసారి కలవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర నుండి పవన్‌కు కబురు వచ్చిందట. దాంతో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చా అని చెప్పాడు. ఇక బాలయ్య అడిగిన ప్రశ్న సంగతి చూస్తే.. పవన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే.. బాలయ్య మరి టీడీపీలో ఎందుకు చేరలేదు అని అడిగితే..
అప్పట్లో నేను కాంగ్రెస్‌లో కూడా చేరలేదు అని గుర్తు చేశాడు. అప్పటికే ప్రజల్లో ఉన్న పార్టీలకు సిద్ధాంతాలు, లక్ష్యాలు ఉంటాయి. అధికారం రాని చాలా గ్రూప్స్ కోసం అండగా ఉండాలంటే.. అప్పటికే ఉన్న పార్టీలతో ఎంతవరకు సాధించగలనన్న సందేహం వచ్చిందట పవన్‌కి. దీంతో తనకు తాను కొన్ని మూలసిద్ధాంతాలు పెట్టుకుని జనసేన పార్టీ స్థాపించాను అని చెప్పాడు పవన్. దాంతోపాటు అధికారమున్నా, లేకపోయినా ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అడుగులు వేయాలంటే నేనే రాజకీయ పార్టీ పెట్టాలి అనిపించింది అని కూడా చెప్పాడు.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!