OG Movie: పవన్ సినిమాల నుంచి వరుస అప్ డేట్స్.. ఆరోజే ఫస్ట్ లుక్ రిలీజవుతుందట!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోగా ఇప్పుడు మాత్రం బుకింగ్స్ కొంతమేర తగ్గాయి. అయితే పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ కూడా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి వరుస అప్ డేట్స్ వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓజీ మూవీ ఫస్ట్ లుక్ ఈ నెల 15వ తేదీన ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఓజీ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని ఈ సినిమా సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. సుజీత్ పక్కాగా బ్లాక్ బస్టర్ సాధించాలనే ఆలోచనతో ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను ఈ సినిమాలో కొత్తగా చూపించనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో పవన్ పాత్ర నిడివి గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా వాస్తవాలు తెలియాల్సి ఉంది. ఓజీ మూవీ ఫస్ట్ గ్లింప్స్ పవన్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ కానుందని భోగట్టా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా రికార్డులు సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

పవన్ ఓజీ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో పవన్ మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus