మెగాస్టార్ బర్త్ డే పార్టీకి పవన్ భార్య!

  • August 24, 2016 / 01:35 PM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా సోమవారం రాత్రి పార్క్ హ‌య‌త్ హోట‌ల్లో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, డైరక్టర్లు హాజరయ్యారు. వీరిలో మహేష్ బాబు, రవితేజ, శ్రీకాంత్, అఖిల్, రాశీఖన్నా, ప్రగ్య జైస్వాల్ తదితరులున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు.

కానీ అతని భార్య అన్నా లేజ్నోవా అటెండ్ అయింది. సాధారణంగా బయట కనిపించని ఈమె ఈమధ్య కుటుంబ వేడుకల్లో పాల్గొంటోంది. కొన్ని రోజుల క్రితం జరిగిన చిరంజీవి కుమార్తె శ్రీజ పెళ్లిలో కనిపించింది. మళ్లీ ఇన్ని రోజులకు పవన్ సతీమణి ఈ ఈవెంట్ కి హాజరైంది. విదేశాల్లో పుట్టి పెరిగిన ఈమె మన సంప్రదాయాలను గౌరవిస్తోంది. పెద్దల పట్ల మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తోంది. ఆ వేడుకలో పవన్ అభిమానులు అన్నా లేజ్నోవా ఫోటో ను క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటో ఎక్కువ షేర్లు. లైక్ లు అందుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus