కమెడియన్ ను కసురుకొన్న పవర్ స్టార్!

  • March 16, 2016 / 11:16 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తోటి నటీనటులకు మాత్రమే కాక, కిందస్థాయి టెక్నీషియన్లకు మంచి మర్యాద ఇస్తూ.. సదరు వ్యక్తి ప్రవర్తన నచ్చితే పక్కన కూర్చోబెట్టుకొని మరీ భోజనం పెట్టిస్తాడు. ఇది జగమెరిగిన సత్యం.
అయితే.. ఇటీవల “సర్దార్ గబ్బర్ సింగ్” షూటింగ్ సమయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఓ కమెడియన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడట. తక్షణం సెట్ లోంచి వెళ్ళిపోమని ఆజ్ఞలు జారీ చేసాడట. సాక్ష్యాత్తు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విధంగా తనపై అరవడంతోపాటు, సెట్ లోనుంచి వెళ్ళిపోమని చెప్పడంతో.. సదరు కమెడియన్ వేరే దారి లేక ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కోపానికి బలైన ఆ నటుడు ఎవరనేది ఇంకా తెలియనప్పటికీ.. దర్శకుడు బాబీపై సదరు కమెడియన్ పలుమార్లు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడమే పవన్ కోపానికి కారణమని మాత్రం తెలిసింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus