Peddha Kapu 1: దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడుగా..!

ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు, యూత్ ఫుల్ చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. రూటు మార్చి ‘నారప్ప’ అనే కంప్లీట్ మాస్ మూవీ చేశాడు. అయితే అది తమిళంలో హిట్ అయిన ‘అసురన్’ కి రీమేక్. పైగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘ఆ సినిమా శ్రీకాంత్ అడ్డాల తీసాడా?’ అనే డౌట్ కూడా వస్తుంది. అంత వయొలెన్స్ ఉంటుంది ఆ సినిమాలో..! ఇప్పుడు ‘పెదకాపు’ అనే సినిమా చేశాడు.

అది కూడా ‘నారప్ప’ కి ఏమాత్రం తీసిపోని విధంగానే ఉంటుంది అని అందరికీ క్లారిటీ వచ్చింది. ఇది ఒక న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్. ‘అఖండ’ చిత్రాన్ని తెరకెక్కించిన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. అతని బావమరిది విరాట్ కర్ణ.. ఈ చిత్రంలో హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక 2 నిమిషాల 24 సెకన్ల నిడివి కలిగిన ‘పెదకాపు -1 ‘ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఆల్రెడీ ఈ సినిమా (Peddha Kapu 1) ట్రైలర్ యూట్యూబ్ లో 2 .6 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసి ట్రెండింగ్ లో నిలిచింది. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్, మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… ఇవన్నీ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి.అలాగే ట్రైలర్ ను మళ్ళీ మళ్ళీ చూసే విధంగా కూడా చేస్తున్నాయి అని చెప్పాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus