Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది'(Peddi) సినిమా నిన్న(జూన్ 4న) రిలీజ్ అయ్యింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన సినిమా ఇది. మొదటి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ ను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.కచ్చితంగా అతనికి నేషనల్ అవార్డు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కథ, కథనాల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని చరణ్ పెర్ఫార్మన్స్ తో కవర్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు బుచ్చిబాబు.

Peddi

ఏదేమైనా మొదటి నుండి ‘పెద్ది’ ప్రాజెక్టుపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, గ్లిమ్ప్స్ వంటివి హైప్ క్రియేట్ చేయడంతో.. సినిమాకి బిజినెస్ బాగా జరిగింది.

అందుకు తగ్గట్టే సినిమా మొదటి రోజు ప్రీమియర్స్ తో కూడా కలుపుకొని రూ.135 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు.ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ‘పెద్ది’ నిజంగానే ఇంత కలెక్ట్ చేసిందా? అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.112.5 కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు.అది కూడా ప్రీమియర్స్ తో కలుపుకొని. అందులో ఇండియా గ్రాస్ అయితే రూ.82.49 కోట్లుగా ఉంది. కానీ మేకర్స్ మాత్రం రూ.135 కోట్ల గ్రాస్ పోస్టర్ వేశారు. అలా చూసుకున్నా ఈ సినిమా పవన్ కళ్యాణ్ ‘ఓజి’ వసూళ్లను అధిగమించకపోవడం గమనార్హం. అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా ఓపెన్ చేయడం అనేది కూడా డే1 కలెక్షన్స్ పై ప్రభావం చూపినట్టు అర్ధం చేసుకోవచ్చు.

రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus