Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

‘జైలర్‌’ సినిమా వచ్చేటంత వరకు అది ‘రజనీకాంత్‌ సినిమా’. ఆ సినిమాను నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు అంతే. కానీ ఆ సినిమా విడుదలయ్యాక అది మోహన్‌ లాల్‌ సినిమా, శివరాజ్‌ కుమార్‌ సినిమా అయిపోయింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆ సినిమా బాలకృష్ణ సినిమా కూడా అయి ఉండేది. కానీ ఎందుకో కానీ అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రెడీ అయింది.  అక్టోబర్ లో సినిమాను రిలీజ్‌ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో సినిమాలోని కేమియోలపై చర్చ జరుగుతూనే ఉంది.

Jailer 2

‘జైలర్‌’ సినిమాలో రెండే కేమియోలు ఉండగా.. ఈసారి నాలుగు కేమియోలు అని అన్నారు. అందులో ఇద్దరు గత సినిమాలో నటించిన మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌. మరో ఇద్దరు కొత్తగా వస్తారు అని చెప్పారు. ఆ మేరకు బాలీవుడ్‌ నుండి ఇద్దరు స్టార్‌ హీరోల పేర్లు, కోలీవుడ్‌ నుండి ఓ స్టార్‌ హీరో పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ కేమియోల సంఖ్య నాలుగు కాదు ఎనిమిది అని అంటున్నారు. ‘జైలర్‌ 2’లో రజనీకాంత్‌ కోసం పని చేయబోయేది ఎనిమిది మంది స్టార్‌లు అన్నమాట. దీంతో ఎవరా ఎనిమిది మంది అనే చర్చ మొదైంది.

ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఆ జాబితాలో ఒకరు. మొన్నీమధ్యే ‘జైలర్‌ 2’ కేమియో గురించి విజయ్‌ సేతుపతి మాట్లాడాడు. కాబట్టి ఆయన కూడా. తొలి ‘జైలర్‌’ నుండి శివరాజకుమార్‌, మోహన్‌ లాల్‌ కలిపితే మొత్తం నలుగురు అయ్యారు. మరి మిగిలిన నలుగురు ఎవరు అనేదే ప్రశ్న. ఎందుకంటే ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒకరిని ఈ సినిమాలోకి తీసుకుంటున్నట్లు ప్యాటర్న్‌ చూస్తే అర్థమవుతోంది.

మలయాళం నుండి మోహన్‌ లాల్‌ రాగా, కన్నడ సినిమా నుండి శివరాజ్‌కుమార్‌ వచ్చారు. బాలీవుడ్‌ నుండి హృతిక్‌ రోషన్‌ వస్తే, తమిళ సినిమా నుండి విజయ్‌ సేతుపతి ఉన్నారు. దీంతో తెలుగు నుండి ఒకరు ఉంటారు. ఇతర భాషలపై, అక్కడి పరిశ్రమలపై దృష్టి పెట్టి భోజ్‌పురి, బెంగాళీ నుండి ఎవరినైనా తీసుకొస్తున్నారా? లేక కోలీవుడ్‌ నుండే ఎవరైనా కేమియోగా వస్తారా అనేది చూడాలి. ఇదంతా తెలియాలంటే అక్టోబరు 15న జైలర్‌ రాక కోసం వేచి చూడాల్సిందే.

రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus