Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?
- June 19, 2026 / 06:32 PM ISTByPhani Kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది'(Peddi). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. ‘వ్రిద్ది సినిమాస్’ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు నిర్మించారు. అలాగే సుకుమార్, నవీన్ యెర్నేని, వై.రవి శంకర్..లు సమర్పకులుగా వ్యవహరించారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘పెద్ది’. జూన్ 3 రాత్రి నుండే ప్రీమియర్ షోలు కూడా వేశారు.
Peddi

వాటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసల వర్షం కురిసింది. క్లైమాక్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘పెద్ది’. తర్వాత కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. 3వ వారంలోకి అడుగుపెట్టినప్పటికీ ‘పెద్ది’ జోరు ఏమీ తగ్గలేదు. 3వ వీకెండ్లో కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే
| నైజాం | 53 cr |
| సీడెడ్ | 21.35 cr |
| ఉత్తరాంధ్ర | 20.69 cr |
| ఈస్ట్ | 11.50 cr |
| వెస్ట్ | 8.23 cr |
| గుంటూరు | 10.50 cr |
| కృష్ణా | 9.27 cr |
| నెల్లూరు | 5.30 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 139.84 cr |
| కర్నాటక + తమిళ్+ హిందీ+ కేరళ | 30.18 cr |
| ఓవర్సీస్ | 20.30 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 190.32 cr(షేర్) |
‘పెద్ది’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.225 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 15 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.190.32 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.340.8 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.34.68 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
రెండో సీక్వెల్ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్
















