Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. ‘వ్రిద్ది సినిమాస్’ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు నిర్మించారు. అలాగే సుకుమార్, నవీన్ యెర్నేని, వై.రవి శంకర్..లు సమర్పకులుగా వ్యవహరించారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘పెద్ది’. జూన్ 3 రాత్రి నుండే ప్రీమియర్ షోలు కూడా వేశారు.

Peddi

వాటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద  రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసల వర్షం కురిసింది. క్లైమాక్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. మొదటి రోజు రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘పెద్ది’. అదే జోరు వీకెండ్ మొత్తం కొనసాగింది. వీక్ డేస్ లో డౌన్ అయినప్పటికీ.. మరీ తీసి పారేసే రేంజ్లో అయితే డౌన్ కాలేదు. మొదటి వారం మొత్తంగా ఓకే అనిపించింది. 8వ రోజు డౌన్ అయినప్పటికీ 9వ రోజు మళ్ళీ ఓకే అనిపించింది. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 49.08 cr
సీడెడ్ 19.49 cr
ఉత్తరాంధ్ర 18.11 cr
ఈస్ట్ 10.43 cr
వెస్ట్ 7.46 cr
గుంటూరు 9.77 cr
కృష్ణా 8.47 cr
నెల్లూరు 4.80 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 127.61 cr
కర్నాటక + తమిళ్+ హిందీ+ కేరళ 26.52 cr
ఓవర్సీస్ 19.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 173.23 cr(షేర్)

‘పెద్ది’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.225 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.173.23 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.308.39 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.51.77 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus