రామ్ చరణ్ ‘పెద్ది'(Peddi) సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏప్రిల్ 30 అని మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ డేట్ కి వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. మేకర్స్ అయితే రిలీజ్ హడావిడి ఏమీ చేయడం లేదు.
‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో హిట్టు కొట్టాలనే దృక్పధంతో రామ్ చరణ్ అహర్నిశలు ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. ప్రమోషన్స్ లో భాగంగా 2 పాటలు వదిలారు. రెండూ కూడా సూపర్ హిట్ అయ్యాయి.
ఇక వదిలిన 2 గ్లింప్స్ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. సో ఈ సినిమాతో చరణ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కానీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రాకపోవడంతో వాళ్ళు డిజప్పాయింట్ అవుతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఇటీవల కాలంలో వేరే సినిమాల ప్రమోషన్స్ కి రావడం మానేశారు. వస్తే ‘పెద్ది’ అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది అతని భయం కావచ్చు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సీనియర్ నటుడు సాయి కుమార్.
‘పెద్ది’ లో సాయి కుమార్ నటించాడా? అంటే దాని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ సాయి కుమార్ తో సెల్ఫి అడిగిన ఓ కుర్రాడు .. తర్వాత ‘పెద్ది’ గురించి అప్డేట్ ఇవ్వాలని కోరాడు. ఆ సమయంలో సాయి కుమార్ ఈ విధంగా స్పందించాడు. ” ‘పెద్ది’ గురించి చెప్పాలా? నేను కూడా నీలానే వెయిటింగు.సాంగ్ షూటింగ్ అవ్వాలి, చరణ్ అదరగొట్టేసి ఉంటాడు అర్దమవుతుంది. సో వెయిటింగ్. ‘వాడి కంట్లో భయం లేదు.. ఒంట్లో బెదురు లేదు.. దెబ్బకి తిరుగులేదు..! ఎవడు..? వాడే రామ్ చరణ్” అంటూ ఇంట్రెస్టింగ్ గా గా ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చారు సాయి కుమార్.
మీ అందరి లాగే నేను కూడా పెద్ది కోసం వెయిటింగ్..
ఇంకా ఒక సాంగ్ షూటింగ్ అవ్వాలి.. చరణ్ అదరగొట్టేశాడు..
– #Saikumar | #Ramcharan | #Peddi pic.twitter.com/ZbMEHcnoc2
— Filmyscoops (@Filmyscoopss) April 13, 2026