నవతరం పెళ్లి చూపులు!

ఇంతకుమునుపు “పెళ్లి చూపులంటే.. పెళ్లికి ముందు అబ్బాయికి అమ్మాయిని చూపించడం కోసం జరిగే ఒక జనరల్ ప్రోగ్రామ్. పెళ్లి చూపుల్లో అమ్మాయికి అబ్బాయి నచ్చినా, నచ్చకపోయినా చచ్చినట్లు మెడవంచి తాళి కట్తించుకోవాల్సిందే. అయితే.. నేటితరంలో మాత్రం పెళ్లి చూపులు అనే కార్యక్రమం వ్యవహారశైలి మారిపోయింది. ఇళ్లలో కాకుండా కాఫీ షాపుల్లోనే దాదాపు 60% పెళ్లి చూపులైపోతున్నాయి. మిగిలిన వారిలో 30% మంది ఆన్ లైన్ లోనే ప్రేమించేసుకొని.. కుదిరితే కాపురాలు కూడా చేసేస్తున్నారు.
ఈ విధమైన “నవతరం పెళ్లి చూపులు” కథాంశంగా యువ ప్రతిభాశాలి తరుణ్ భాస్కర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రాజ్ కందుకూరి నిర్మిస్తున్న చిత్రం “పెళ్లి చూపులు”. “ప్రేమ ఇష్క్ కాదల్” ఫేం రీతువర్మ, “ఎవడే సుబ్రమణ్యం” ఫేం విజయ్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ నిన్న విడుదలైంది. వయో భేదం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ ప్రచార చిత్రాన్ని ఆదరిస్తున్నారు.
“అమ్మాయిని చూడగానే పడిపోయిన కుర్రాడికి.. అసలా అమ్మాయికి పెళ్ళే ఇష్టం లేదని తెలిస్తే…” ఎలా ఉంటుందో టీజర్ లో చాలా సహజంగా చూపించారు.
చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తోనే రీతువర్మ, విజయ్ లు అందర్నీ ఆకట్టుకొన్నారు. టీజర్ తోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ చిత్ర పరిశ్రమను సైతం ఆకర్షించగలిగాడు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus