పునీత్ ఆఖరి చిత్రం గంధాడ గుడి సినిమాపై ప్రశంసలు కురిపించిన మోడీ?

కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన మరణించి ఏడాది అవుతున్న ఇప్పటికీ ఈయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా మరణించి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఆఖరిగా నటించిన చిత్రం గంధాడ గుడి సినిమాట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే మోడీ స్పందిస్తూ అప్పు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానుల హృదయంలో జీవించే ఉన్నారని,

ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం శక్తితో నిండి ఉన్నారని, ఆయన నటించిన గంధాడ గుడి ప్రకృతి మాతకు, కర్ణాటక ప్రకృతి సౌందర్యానికి, పర్యావరణానికి నివాళి ఇలాంటి ఓ మంచి ప్రయత్నం చేసిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ నరేంద్ర మోడీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా ఈ సినిమాపై నరేంద్ర మోడీ స్పందించి ట్వీట్ చేయడంతో పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని రాజ్ కుమార్ స్పందిస్తూ తిరిగి రిప్లై ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ నమస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఈరోజు మాకు ఎమోషనల్ డే కావడంతో అప్పు నటించిన చివరి చిత్రం గంధాడ గుడి నుంచి ట్రైలర్ విడుదల చేసాము. ఈ సినిమా ఎల్లప్పుడూ అప్పు హృదయానికి దగ్గరగా ఉంటుంది.అప్పు ఎల్లప్పుడూ మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేసేవారు. అలాగే తన అభిప్రాయాలను మీతో పంచుకోవడానికి ఇష్టపడేవారు అంటూ ఈ సందర్భంగా అశ్విని చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి అప్పు అశ్విని దిగిన ఫోటోని షేర్ చేస్తూ మరో ట్విట్ చేశారు..ఇక ఈ సినిమా అప్పు చివరి చిత్రం కావడంతో ఈ సినిమాని ఆయన మొదటి వర్ధంతికి ముందు రోజు అనగా అక్టోబర్ 28వ తేదీ ఘనంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus