Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • April 17, 2026 / 01:27 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ర‌మేష్ ఇందిరా (Hero)
  • శృతి నాయుడు (Heroine)
  • అచ్యుత్ కుమార్‌, స్నేహ‌ల్ కామ‌త్‌, అర్జున్ అంబ‌టి, ప్రియా త‌దిత‌రులు (Cast)
  • ర‌మేష్ ఇందిరా (Director)
  • శృతి నాయుడు (Producer)
  • ముత్తు గ‌ణేష్‌ (Music)
  • శ్రీషా కుడువ‌ల్లి (Cinematography)
  • రాజేంద్ర‌ (Editor)
  • Release Date : 17th ఏప్రిల్ 2026
  • ఆహా ఒరిజినల్స్ (Banner)

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో భ‌క్త క‌థ‌ల‌ ట్రెండ్ న‌డుస్తోంది. ఈ మైథాల‌జీ కాన్సెప్ట్‌తో తెలుగులో వ‌చ్చిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ పోచ‌మ్మ‌. ర‌మేష్ ఇందిరా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో శుక్ర‌వారం రిలీజైంది. అచ్యుత్ కుమార్‌, స్నేహ‌ల్ కామ‌త్‌, అర్జున్ అంబ‌టి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈసిరీస్‌ను శృతి నాయుడు నిర్మించారు. పోచ‌మ్మ వెబ్‌సిరీస్ ఎలా ఉంది? భ‌క్తి క‌థ‌తో ద‌ర్శ‌కుడు ర‌మేష్ ఇందిరా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడా? లేదా? అంటే?

Pochamma Web-Series Review

Pochamma web-series Review And Rating

క‌థ‌: అర‌కులోని ఓ కాఫీ ఎస్టేట్‌ను కొనుగోలు చేస్తాడు ఫెడ్రిక్ (ర‌మేష్ ఇందిరా). కుటుంబంతో క‌లిసి ఆ ఎస్టేట్‌లోని బంగ‌ళాలో దిగుతాడు. ఒక‌ప్పుడు ఆ ఎస్టేట్‌కు ఓన‌ర్‌గా ఉన్న ర‌ఘుప‌తి (అచ్యుత్ కుమార్‌) స‌మ‌స్య‌ల కార‌ణంగా దానిని అమ్ముకొని అందులో మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. త‌న బంగ‌ళా ఎదురుగా ఉన్న పోచ‌మ్మ విగ్ర‌హాన్ని ఫెడ్రిక్ బ‌ల‌వంతంగా తొల‌గిస్తాడు. ఆ సంఘ‌ట‌న జ‌రిగిన కొద్ది రోజుల త‌ర్వాత ఫెడ్రిక్ కూతురు జెస్సీ (స్నేహ‌ల్ కామ‌త్‌) అనుమానాస్పద రీతిలో చ‌నిపోతుంది. జెస్సీ చావుకు ర‌ఘుప‌తి కొడుకు సురేష్ కార‌ణ‌మ‌ని ఫెడ్రిక్ పెద్ద కూతురు ఇవా (ప్రియా) ఆరోపిస్తుంది. ఇవా భ‌ర్త డేవిడ్‌ను (అర్జున్ అంబ‌టి) కూడా పోలీసులు అనుమానిస్తారు. అస‌లు జెస్సీ ఎలా చ‌నిపోయింది? పోచ‌మ్మ విగ్ర‌హం తొల‌గించిన త‌ర్వాత ఫెడ్రిక్ ఇంట్లో ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి? ఫెడ్రిక్ ఫ్యామిలీలో జ‌రుగుతోన్న అన‌ర్థాల‌కు అస‌లు కార‌కులు ఎవ‌రు? అత్యాశ‌తో చేసిన త‌ప్పుకు ర‌ఘుప‌తి ఫ్యామిలీకి ఎలాంటి శిక్ష ప‌డింది? అనే అంశాల‌తో పోచ‌మ్మ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది.

Pochamma web-series Review And Rating

న‌టీన‌టుల ప‌నితీరు: కుటుంబ పెద్ద‌గా ఫెడ్రిక్ పాత్ర‌లో డైరెక్ట‌ర్ ర‌మేష్ ఇందిరా హుందాగా క‌నిపించారు. అత‌డి పాత్ర‌కు సంబంధించిన‌ డ‌బ్బింగ్ విష‌యంలో కాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో అచ్యుత్ కుమార్ న‌ట‌న ఈ వెబ్‌సిరీస్‌కు హైలైట్‌గా నిలిచింది. ర‌ఘుప‌తి క్యారెక్ట‌ర్‌లో అత‌డి చూపించిన వేరియేష‌న్స్ బాగున్నాయి. అర్జున్ అంబ‌టి క్యారెక్ట‌ర్ రొటీన్‌గా అనిపిస్తుంది. ప్రియా, స్నేహ‌ల్ కామ‌త్ గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్నారు. యాక్టింగ్‌లోనూ ప‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన వారి న‌ట‌న ఓకే.

న‌టుడిగానే కాకుండా డైరెక్ట‌ర్‌గా కూడా ర‌మేష్ ఇందిరా ఆక‌ట్టుకున్నాడు. రొటీన్ క‌థే అయినా స్క్రీన్‌ప్లే విష‌యంలో అత‌డి మ్యాజిక్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ముత్తు గ‌ణేష్ మ్యూజిక్, శ్రీష సినిమాటోగ్ర‌ఫీ థ్రిల్ల‌ర్ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. క‌థ‌లోని స‌స్పెన్స్‌ను మ‌రింత ఎలివేట్ చేశాయి. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ కూడా ప‌ర్వాలేదు.

Pochamma web-series Review And Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: న‌టుడిగానే కాకుండా డైరెక్ట‌ర్‌గా కూడా ర‌మేష్ ఇందిరా ఆక‌ట్టుకున్నాడు. రొటీన్ క‌థే అయినా స్క్రీన్‌ప్లే విష‌యంలో అత‌డి మ్యాజిక్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ముత్తు గ‌ణేష్ మ్యూజిక్, శ్రీష సినిమాటోగ్ర‌ఫీ థ్రిల్ల‌ర్ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. క‌థ‌లోని స‌స్పెన్స్‌ను మ‌రింత ఎలివేట్ చేశాయి. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ కూడా ప‌ర్వాలేదు.

Pochamma web-series Review And Rating

విశ్లేష‌ణ‌: రూపాలు వేరైనా దేవుళ్లు అంద‌రూ ఒక్క‌టే. కానీ మ‌నుషులే త‌మ స్వార్థం, అత్యాశ‌తో దేవుళ్ల అడ్డం పెట్టుకొని కుట్ర‌లు, కుతంత్రాలు చేస్తున్నార‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ర‌మేష్ ఇందిరా పోచ‌మ్మ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి మైథాల‌జీ ఎలిమెంట్‌ను జోడించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఎంగేజింగ్‌గా సిరీస్ సాగుతుంది. పోచ‌మ్మ వెబ్‌సిరీస్‌ను కేవ‌లం ఐదు ఎపిసోడ్స్‌తోనే రూపొందించారు ద‌ర్శ‌కుడు. అన‌వ‌స‌ర‌పు ల్యాగ్‌, ప‌రిమితికి మించిన పాత్ర‌లు లేకుండా కేవ‌లం ఐదారు క్యారెక్ట‌ర్ల‌తో ఒకే లోకేష‌న్‌లో క‌థ మొత్తం సాగేలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేను రాసుకున్నారు.

జెస్సీ చ‌నిపోయే సీన్‌తోనే ఈ సిరీస్ మొద‌లుకావ‌డం ఆస‌క్తిని పంచుతుంది. ఆ చావుకు వెనుక ఏం జ‌రిగింది అన్న‌ది బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో స‌స్పెన్స్‌ను బిల్డ్ చేస్తూ క‌థ‌ను ముందుకు న‌డిపించారు. పోచ‌మ్మ విగ్ర‌హాన్ని ఫెడ్రిక్ తొల‌గించ‌డానికి సిద్ధం కావ‌డం, ర‌ఘుప‌తి అడ్డుచెప్పే స‌న్నివేశం నుంచే సిరీస్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. జెస్సీ మ‌ర‌ణం, ఈవాకు యాక్సిడెంట్‌…వాటికి కార‌ణం పోచ‌మ్మ శాప‌మా.. విల‌న్ ఎవ‌రైనా ఉన్నారా అన్న‌ది ఆడియెన్స్ ఊహ‌ల‌కు అంద‌కుండా ఉంటుంది. ఒక్కో పాత్ర ఒక్కోసారి ఒక్కోలా రియాక్ట్ కావ‌డం ఉత్కంఠ‌ను మ‌రింత పెంచుతుంది.

నాలుగు ఎపిసోడ్స్‌లో ప్ర‌శ్న‌ల‌న్నింటికి చివ‌రి ఎపిసోడ్‌లో స‌మాధానం ఇచ్చారు ద‌ర్శ‌కుడు. అస‌లు విల‌న్ ఎవ‌ర‌న్న‌ది రివీల‌య్యే ట్విస్ట్ బాగుంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాలు చూసే ఆడియెన్స్ మాత్రం ఇలాంటివి ఈజీగానే గెస్ చేస్తారు. సిరీస్ నిడివి త‌క్కువే అయినా కొన్ని సీన్లు ల్యాగ్ ఫీలింగ్‌ను క‌లిగిస్తాయి. భ‌క్తి ఎలిమెంట్‌ను ఇంకాస్త బాగా రాసుకుంటే బాగుండేది. పైపైనే ట‌చ్ చేశారు.

అచ్యుత్‌, ర‌మేష్ ఇందిరాతో పాటు మిగిలిన న‌టీన‌టులంద‌రూ క‌న్న‌డ వాళ్లే కావ‌డం కూడా మైన‌స్‌గా మారింది. డ‌బ్బింగ్ సిరీస్ చూస్తున్న‌ట్లుగా అనిపిస్తుంది.

Pochamma web-series Review And Rating

ఫోక‌స్ పాయింట్‌: భ‌క్తి, థ్రిల్ క‌ల‌గ‌లిసిన‌ డీసెంట్ సిరీస్‌

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Pochamma
  • #Priya Shatamarshan
  • #Ramesh Indira
  • #Shruti Naidu

Reviews

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

4 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

5 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

6 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

8 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version