రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ థియేటర్లలో యావరేజ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో ఉన్న కొన్ని పొలిటికల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా గతంలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన పలు సినిమాలలో సైతం డైలాగ్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో ఈ సినిమా షేర్ కలెక్షన్లు 14.33 కోట్ల రూపాయలుగా ఉండగా శని, ఆదివారాలలో ఈ సినిమా మరో పది కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే ఛాన్స్ అయితే ఉంది.
అయితే టార్గెట్ పెద్దది కావడంతో ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. అయితే స్కంద మూవీలో అసలు సిసలు డైలాగ్స్ మిస్ అయ్యాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వల్ల నిర్మాతలు రిక్వెస్ట్ చేసి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్ ను తీసేయించారని సమాచారం అందుతోంది. కొన్ని డైలాగ్ లకు డబ్బింగ్ మార్చి మళ్లీ చెప్పించినట్టు సమాచారం అందుతోంది.
చంద్రబాబు అరెస్ట్ కాకుండా ఉండి ఉంటే మాత్రం (Skanda) స్కంద మూవీ మరోలా ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్కంద రిజల్ట్ వల్ల ఈ సినిమా సీక్వెల్ డౌటేనని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. స్కంద సీక్వెల్ తెరకెక్కించినా సీక్వెల్ ఆశించిన స్థాయిలో మెప్పించడం సాధ్యం కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు. అయితే హిట్టైన సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తే బాగుంటుందని రిలీజ్ కు ముందే సీక్వెల్స్ ప్రకటించడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేయాల్సి ఉంది.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !