పూజా హెగ్డే దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్రతారగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఈమె అగ్రతారగా పేరు సంపాదించుకోవడమే కాకుండా వరుస సినిమా అవకాశాలతో ఏమాత్రం తగ్గడం లేదు.సాధారణంగా ఎవరికైనా ఒకటి లేదా రెండు సినిమాలు వెంటనే ఫ్లాప్ అయితే అవకాశాలు రావడం కష్టమవుతాయి. కానీ పూజ హెగ్డే విషయంలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నం అని చెప్పాలి.
ఈమె నటించిన వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఈమెకు వరుస సినిమా అవకాశాలు రావడం విశేషం.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు అలాగే తెలుగులో కూడా మరో రెండు సినిమాలతో పూజా హెగ్డే ఎదో బిజీబిజీగా గడుపుతున్నారు.ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తో కలిసి మాజా కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఈ యాడ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు అమితాబచ్చన్ తో కలిసి నటించాలని ఎప్పటినుంచో కోరికగా ఉండేది. అయితే ఆయనతో కలిసి నటించే అవకాశం ఇలా రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విధంగా అమితాబచ్చన్ గారితో కలిసి ఈ యాడ్ లో చేస్తున్నప్పుడు తాను ఎంతో అనుభూతికి లోనయ్యానని ఆయన లాంటి వ్యక్తితో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమని పూజా హెగ్డే వెల్లడించారు.
ఈ యాడ్ లో నేను ఆయన మనవరాలుగా నటిస్తున్నప్పుడు ఎంతో మంచి అనుభూతికి లోనయ్యాను. ఈ వయసులో కూడా అమితాబ్ గారు ఎంతో డెడికేషన్, కరెక్ట్ టైమింగ్ చూసి ఎంతో నేర్చుకున్నానని ఆయన ఎల్లప్పుడూ మాలాంటి వారికి గురువు అంటూ పూజా హెగ్డే అమితాబచ్చన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.